Mental Health : మానసిక రోగుల కోసం పాసో రోబుల్స్‌లో భారీ చికిత్సా కేంద్రం.. 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : మానసిక ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్న వారికి మెరుగైన వైద్యం అందించే దిశగా శాన్ లూయిస్ ఓబిస్పో కౌంటీ కీలక నిర్ణయం తీసుకుంది. పాసో రోబుల్స్‌లో అత్యాధునిక 'బిహేవియరల్ హెల్త్' కేంద్రాన్ని నిర్మించేందుకు కాలిఫోర్నియా రాష్ట్ర ప్రభుత్వం 2.1 కోట్ల డాలర్లు అంటే సుమారు రూ.175 కోట్లు భారీ గ్రాంటును మంజూరు చేసింది. దీనివల్ల స్థానికులకు వ్యసనాల నుంచి విముక్తితో పాటు మానసిక ప్రశాంతత లభించనుంది.

 

ఇది కూడా చదవండి..హార్ట్ ఎటాక్ తర్వాత తొలి 60 నిమిషాలు ఎందుకంత కీలకం..?

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..

ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

 

అత్యాధునిక సదుపాయాలతో 'పాత్‌వేస్ హోమ్'..

రూ.175 కోట్ల నిధులతో 'పాత్‌వేస్ హోమ్' అనే ప్రాజెక్టును చేపట్టనున్నారు. దీని కోసం ఇప్పటికే 416 స్ప్రింగ్ స్ట్రీట్‌లోని భవనాన్ని కొనుగోలు చేసి, దానిని ఆధునికీకరించనున్నారు. ఈ కేంద్రంలో ప్రధానంగా..16 పడకల మానసిక కేంద్రం ఏర్పాటు చేయనున్నారు, ఇందులో 12 పడకలు పెద్దలకు, 4 పడకలు యువతకు కేటాయించనున్నారు.

క్రైసిస్ రెసిడెన్షియల్ ట్రీట్‌మెంట్.. అత్యవసర సమయంలో రోగులకు స్వల్పకాలిక రక్షణ, చికిత్స అందించేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మత్తు పదార్థాల విముక్తి..కోసం ప్రత్యేక చికిత్స.. డ్రగ్స్, ఇతర వ్యసనాల బారిన పడిన వారికి ఇక్కడ నిపుణులైన వైద్యులు కౌన్సెలింగ్, చికిత్స అందిస్తారు.


ప్రస్తుతం శాన్ లూయిస్ ఓబిస్పో కౌంటీలో యువత కోసం ప్రత్యేకంగా మానసిక వైద్య పడకలు అందుబాటులో లేవు. దీనివల్ల రోగులను చికిత్స కోసం ఇతర ప్రాంతాలకు లేదా దూరంగా ఉన్న నగరాలకు తీసుకెళ్లాల్సి వస్తోంది. కొత్త కేంద్రం అందుబాటులోకి వస్తే, స్థానికంగానే తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్యం అందుతుందని కౌంటీ అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

వచ్చే మూడేళ్లలో..

ఈ ప్రాజెక్టు 2028-29 ఆర్థిక సంవత్సరం నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మానసిక సంక్షోభంలో ఉన్నవారికి ఈ కేంద్రం ఒక ఆశాకిరణం లాంటిది. కుటుంబ సభ్యులకు దగ్గరగా ఉంటూనే వారు కోలుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామని బిహేవియరల్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ స్టార్ గ్రాబెర్ తెలిపారు.

 

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..? 

ఇది కూడా చదవండి..ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హానికరం..?

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.