Meditation: ధ్యానం చేయడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్: శారీరక రుగ్మతలకు యోగా ఎలాగైతే ఉపకరిస్తుందో, మానసిక ఆరోగ్యానికి ధ్యానం కూడా అదేవిధంగా ఉపయోగపడుతుంది. రోజువారీ ధ్యాన సాధనతో ఒత్తిడి, నిరాశ వంటివి దరిచేరవు. కోవిడ్ మహమ్మారి కాలంలో ప్రశాంతమైన మనస్సు, ఆరోగ్యకరమైన ఊపిరితిత్తులు, బలమైన రోగనిరోధక శక్తితో కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో ధ్యానం ఎంతగానో ఉపయోగపడిందని యోగా నిపుణులు నొక్కిచెబుతున్నారు.

ఇది కూడా చదవండి..కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?  

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..థ్రోంబోసైట్లు అంటే ఏమిటి..?

శ్వాస.. ఆరోగ్య రహస్యం.. 

ప్రాణాయామం, మైండ్‌ఫుల్ మెడిటేషన్, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, మానసిక ఆరోగ్యం వంటి అనేక ఆరోగ్యకరమైన అంశాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని యోగా నిపుణులు అంటున్నారు. మనం ఎలా శ్వాస తీసుకుంటామో అనే దానిపైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని వారు స్పష్టం చేస్తున్నారు. కరోనా మహమ్మారి ఊపిరితిత్తుల ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించింది.

సరైన శ్వాస విధానం తెలుసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. వివిధ మానసిక స్థితులలో శ్వాస వేగంలో తేడాలను మనం అనుభవిస్తాం. ఉదాహరణకు, కోపంగా ఉన్నప్పుడు శ్వాస వేగంగా జరుగుతుంది. సంతోషంగా ఉన్నప్పుడు సాధారణ వేగంతో ఉంటుంది. శ్వాస విధానంలో మార్పులు మానసిక పరిస్థితిలో కనిపిస్తాయి.

ధ్యానం ప్రయోజనాలు..? 

ధ్యానం చేయడం ద్వారా మానసిక ప్రశాంతతను పొందడమే కాకుండా, శరీరంలో శక్తి పెరుగుతుంది. ప్రాణాయామం ద్వారా మన ప్రాణశక్తిని నియంత్రించుకోవచ్చని యోగా నిపుణులు వెల్లడిస్తున్నారు. సరైన శ్వాస విధానం గురించి తెలుసుకోకుండా ధ్యానం చేస్తే, ప్రాణశక్తి ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడతాయి. ప్రాణాయామం చేయడం ద్వారా శారీరక, మానసిక సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.

ధ్యానం శరీరం, మనస్సు, ఆత్మల మధ్య సామరస్యాన్ని సృష్టిస్తుంది. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యంపై కూడా శ్రద్ధ చూపడం చాలా ముఖ్యం అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ధ్యానంతో సంపూర్ణ ఆరోగ్యాన్ని సాధించవచ్చని వారు స్పష్టం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి.. ఇన్‌స్టంట్ నూడుల్స్ సైడ్ ఎఫెక్ట్స్.. 

ఇది కూడా చదవండి.. మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?  

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.