సైలోసిబిన్ అంటే ఏమిటి..? దాని ప్రభావం ఎలా ఉంటుంది..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : 'మ్యాజిక్ మష్రూమ్స్'లో సహజంగా లభించే సైలోసిబిన్ అనే ఎంజైమ్, మెదడులోని రసాయనాలపై ప్రభావం చూపి, మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఇది డిప్రెషన్, ఆందోళన వంటి సమస్యలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ చికిత్స విశేషం ఏమిటంటే, ఒకే మోతాదుతో సరైన పర్యవేక్షణలో చికిత్స అందిస్తే, దాని ప్రభావం చాలా కాలం పాటు ఉంటుందని పరిశోధకులు గుర్తించారు.

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

ఇది కూడా చదవండి.. నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు 

కొత్త పరిశోధన..?

అమెరికాకు చెందిన పరిశోధకులు ఇటీవల 28 మంది క్యాన్సర్ రోగులతో ఒక చిన్న-స్థాయి అధ్యయనాన్ని నిర్వహించారు. వీరందరూ తీవ్రమైన డిప్రెషన్‌తో బాధపడుతున్నారు. ఈ రోగులకు 25 మిల్లీగ్రాముల సైలోసిబిన్ మోతాదును అందించారు. అయితే, ఈ ఔషధాన్ని ఒంటరిగా కాకుండా, మానసిక వైద్యుల పర్యవేక్షణలో ప్రత్యేక చికిత్సతో కలిపి ఇచ్చారు.

రెండేళ్ల తర్వాత ఆయా ఫలితాలు ఆశ్చర్యపరిచాయి. 53శాతం మంది రోగులలో డిప్రెషన్ లక్షణాలు గణనీయంగా తగ్గాయి. అంతేకాదు 50శాతం మంది రోగులలో డిప్రెషన్ పూర్తిగా నయమైంది. 43శాతం మంది రోగులలో ఆందోళన స్థాయిలు కూడా తగ్గాయి.

ఈ పరిశోధన బృందానికి చెందిన ప్రధాన రచయిత డాక్టర్ మనీష్ అగర్వాల్ మాట్లాడుతూ, "ఒకేసారి సైలోసిబిన్ థెరపీతో డిప్రెషన్ నుంచి ఇంత సుదీర్ఘ ఉపశమనం లభించడం నిజంగా గొప్ప విషయం. ఈ చికిత్సను మరింత విస్తృతం చేసి, ఎక్కువ మంది రోగులకు ప్రయోజనం చేకూర్చడానికి మేము ప్రయత్నిస్తున్నాము" అని పేర్కొన్నారు.

మానసిక ఆరోగ్యానికి సరికొత్త చికిత్స..  

ప్రస్తుతం పరిశోధకులు ఈ అధ్యయనంపై దృష్టి సారించారు. ఇందులో ఎక్కువ మంది రోగులు, అధిక మోతాదుల సైలోసిబిన్, ప్లేసిబోతో పోలిక వంటి అంశాలను పరిశీలించనున్నారు. క్యాన్సర్ వంటి వ్యాధులతో మానసికంగా కుంగిపోయే రోగులకు సైలోసిబిన్ ఒక ప్రామాణిక చికిత్సగా మారగలదని పరిశోధకులు వెల్లడిస్తున్నారు.

 జాగ్రత్త అవసరం.. !

ఈ పరిశోధన ఫలితాలు అత్యంత ఆశాజనకంగా ఉన్నప్పటికీ, వైద్య పర్యవేక్షణ లేకుండా సైలోసిబిన్‌ను ఉపయోగించడం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది సాధారణ వ్యక్తికి ఉద్దేశించిన ఔషధం కాదు. శిక్షణ పొందిన వైద్యుల పర్యవేక్షణలో, నియంత్రిత వాతావరణంలో మాత్రమే దీనిని తీసుకోవాలి.

 సైలోసిబిన్ ఆధారిత చికిత్స భవిష్యత్తులో మానసిక ఆరోగ్య రంగంలో, ముఖ్యంగా క్యాన్సర్ రోగులకు, విప్లవాత్మక మార్పులు తీసుకురాగలదని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. ఒకే మోతాదుతో సంవత్సరాల తరబడి ఉపశమనం లభించడం శాస్త్రీయంగా ప్రోత్సాహకరంగా ఉండటమే కాకుండా, లక్షలాది మంది రోగులకు సరికొత్త ఆశను కూడా కలిగిస్తోంది.

 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి.. ఎలాంటి ఆసనాలు, ముద్రలు వేస్తే జ్ఞాపకశక్తి పెరుగుతుంది..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.