చలికాలంలో స్ట్రోక్ ప్రమాదం పెరగడానికి కారణాలు..? 

సాక్షి లైఫ్ : చలికాలం అనేక వ్యాధులను తెచ్చిపెడుతుంది. వీటిలో ఒకటి బ్రెయిన్ స్ట్రోక్. నిజానికి, చలికాలంలో శరీరంలోని సిరలు కుంచించు కుపోతాయి. దీని ప్రభావం రక్త ప్రసరణపై పడుతుంది. అటువంటి పరిస్థితిలో, బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుంది. అధిక రక్తపోటు, మధుమేహంతో బాధపడుతున్న వ్యక్తుల్లో ఎక్కువగా బ్రెయిన్ స్ట్రోక్  ప్రమాదం ఉందని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. 

శీతాకాలంలో అధిక రక్తపోటు, మధుమేహం, ఊబకాయం లేదా ఏదైనా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చలికాలంలో ఉష్ణోగ్రత తగ్గడం వల్ల శరీరంలోని వేడిని నిర్వహించడం కష్టమవుతుంది. దీని కారణంగా రక్తం గట్టిపడటం ప్రారంభమవుతుంది. ఇది రక్త ప్రసరణలో సమస్యలను కలిగిస్తుంది. దీంతో బ్రెయిన్ స్ట్రోక్‌కు కారణం అవుతుంది.

ఇది కూడా చదవండి..మీ పిల్లలు దేనిమీద ఏకాగ్రత చేయలేకపోతున్నారా..? అయితే.. 

ఇది కూడా చదవండి..అసిడిటీకి ప్రధాన కారణం ఇదే.. 

 

ఇది కూడా చదవండి..ఎలాంటి వ్యాధుల నిర్మూలనకు త్రిఫల చూర్ణం పనిచేస్తుంది..? 

ఇది కూడా చదవండి..కాలేయంలోని వ్యర్థాలను ఎలా తొలగించాలి..?

ఈ సమస్య నుంచి రక్షించుకోవాలనుకుంటే, మీ జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలి. తద్వారా మీరు బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. మీరు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.  పోషకమైన ఆహారం తీసుకోవాలి. తగినంత నిద్రపోవడం ద్వారా బ్రెయిన్ స్ట్రోక్‌ను నివారించవచ్చు.


బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు..?

ముఖం, చేతులు, కాళ్ళలోబలహీనత
మాట్లాడటం కష్టంగా అనిపించడం 
ఆలస్యంగా అర్థం చేసుకోవడం
చూడలేకపోవడం
తీవ్రమైన తలనొప్పి.. 
 
ఎలాంటి వారికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎక్కువ..?  

వృద్ధులకు.. 
మధుమేహ సమస్య ఉన్నవారికి 
ధూమపానం చేసేవారికి
గుండె సంబంధిత సమస్యలున్నవారికి
అధిక రక్తపోటు ఉన్న వారికి
ఫ్యామిలీలో మెదడు స్ట్రోక్ ఉన్నవారికి.. 

ఇది కూడా చదవండి..ఆటిజం థెరపీ ద్వారా పిల్లలు ఆరోగ్యంగా ఉండగలుగుతారా..?

ఇది కూడా చదవండి..పచ్చకామెర్లు ప్రాణాలకు ప్రమాదమా..?

ఇది కూడా చదవండి..కిడ్నీడ్యామేజ్ అయ్యే ముందు కనిపించే 5 లక్షణాలు.. 

ఇది కూడా చదవండి..లిపోప్రోటీన్ గ్లోమెరులోప‌తి అంటే ఏమిటి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. 

Tags : mental-health diabetes brain-health sugar-levels winter-season high-bp brain-stroke brain-damage high-blood-pressure high-bp-symptoms brain-death brain-hormones causes-of-brain-stroke brain-stroke-recovery best-foods-for-brain

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com