స్కిజోఫ్రినియా ఎలాంటి వారికి వచ్చే అవకాశం ఉంటుంది..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : స్కిజోఫ్రెనియా ఒక రకమైన మానసిక అనారోగ్య సమస్య. ఈ సమస్యతో బాధపడుతున్న వ్యక్తి ఆలోచించే, అర్థం చేసుకునే సామర్థ్యం సరిగా ఉండకపోవచ్చు. ప్రస్తుత తరంలో రోజువారీ జీవితంలోని తీవ్రమైన పనిభారం కారణంగా చాలా మంది మానసిక అనారోగ్యానికి గురవుతున్నారు. డిమెన్షియా, అల్జీమర్స్ మానసిక వ్యాధుల మాదిరిగానే, స్కిజోఫ్రెనియా కూడా అంతే. స్కిజోఫ్రెనియా అనేది శారీరకంగా, మానసికంగా రెండింటినీ ప్రభావితం చేసే పరిస్థితి. ఇది సాధారణంగా టీనేజర్లలో కనిపిస్తుంది.

 

ఇది కూడా చదవండి..మంచి కొలెస్ట్రాల్ ను పెంచే దానిమ్మ.. 

ఇది కూడా చదవండి.. ఫ్యాటీ లివర్ ఏ ఏ అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

ఇది కూడా చదవండి.. టీ లో ఎన్నిరకాల వెరైటీలున్నాయో తెలుసా..? 

 

ఈ వ్యాధి ఎవరినైనా ప్రభావితం చేయవచ్చు. ఇది ఒక వ్యక్తి ఆలోచించే ,అర్థం చేసుకునే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. ప్రవర్తనలో మార్పులు కూడా కనిపిస్తాయి. ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయో..? ఇలాంటివారికి ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..  

ఏమిటీ స్కిజోఫ్రెనియా..?

స్కిజోఫ్రెనియా అనేది 16- 45 సంవత్సరాల మధ్య వయస్సు గల వ్యక్తులను ప్రభావితం చేసే మానసిక అనారోగ్యం. కొన్నిసార్లు, ఈ పరిస్థితితో బాధపడుతున్న వ్యక్తులు చాలా బాధపడతారు. పలు అధ్యయనాల నివేదికల ప్రకారం.. ఈ పరిస్థితి తలెత్తినవారికి మెదడు పనిచేయడం మానేస్తుంది. అంతేకాదు ఆలోచనా విధానాలు మారుతాయి.

జ్ఞాపకశక్తి కూడా బలహీనపడుతుంది. ప్రతి విషయంలోనూ ఇబ్బంది పడాల్సి వస్తుంది. దీనికి వెంటనే చికిత్స చేయకపోతే, అది పిచ్చికి దారితీస్తుంది. ఒక్కోసారి ఈ వ్యాధి మరణానికి కూడా కారణమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక లక్ష మందిలో 221 మందిని స్కిజోఫ్రెనియా ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది.

 

ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?

 ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.