పొగిడినా ప్రమాదమేనా..? ఎందుకు..?
సాక్షి లైఫ్ : ప్రశంసలను అతిగా వినడం కూడా మీ ఆరోగ్యానికి హానికరం అని మీకు తెలుసా..? ఈ అలవాటు మిమ్మల్ని ఒక రుగ్మతకు గురయ్యేలా చేస్తుందని మానసికశాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ పరిస్థితి ఎలాంటివారికి వస్తుంది..? దీనిని ఎలా నివారించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.. ఎవరన్నా ఓపని చేసి సక్సెస్ అయితే సహజంగానే వారిని పొగడ్తలతో ముంచెత్తుతుంటారు. ఇలా ప్రతిసారి ప్రశంసలకు అలవాటు పడినవారు మానసికంగా ఓ రకంగా మారిపోతారు. సమాజంలో జీవించేటప్పుడు తీపి, చేదు అన్ని రకాల రుచులను రుచి చూసే అలవాటు పెంచుకోవాలని పెద్దలు తరచూ చెబుతుంటారు. అదేవిధంగా మంచి, చెడుల విషయంలోనూ అలాగే ఉండాలని మన పెద్దలు చెబుతుంటారు.
ఇది కూడా చదవండి..మెదడును ఆరోగ్యంగా ఉంచే అత్యుత్తమ ఆహారం..
ఇది కూడా చదవండి..అపెండిక్స్ క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి.. హెచ్3ఎన్2 అంటే ఏమిటి..? లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి.. ప్రీ-మెనోపాజ్ అనేది ఎలాంటి వాళ్లలో వస్తుంది..?
కొంతమంది తమకు సంబంధించిన ప్రశంసలను వినడానికి మాత్రమే ఇష్టపడతారు. అంతేకాదు చిన్నపాటి అవమానాన్ని కూడా వారు భరించలేరు. ఇలాంటి లక్షణాలున్నవారికి 'నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్' అనే మానసిక సమస్య ఉన్నట్లుగా నిర్ధారించాలని సైకాలజిస్టులు చెబుతున్నారు.
నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్..
తమ ప్రశంసలు వినడానికి ఇష్టపడరు..? అన్ని వేళలా పొగడ్తలు వినాలనుకోవడం చెడ్డ విషయమా అనే ప్రశ్న మీ మదిలో రావచ్చు. చాలా మంది ప్రశంసల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ప్రశంసించకపోతే వారు అశాంతికి గురవుతారు. ఇది ఒక రకమైన మానసిక స్థితి. దీనినే 'నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్' (ఎన్.పి.డి) అంటారు.
నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్‌తో బాధపడుతున్న వ్యక్తులు తమ గొప్పతనాన్ని గురించి చాలా గర్వంగా ఫీలవుతూ ఉంటారు. వారు ఎల్లప్పుడూ ప్రశంసలను మాత్రమే వినడానికి ఇష్టపడతారు. అంతే కాకుండా ఇతరులను తమకంటే తక్కువగా చూస్తుంటారు. మితిమీరిన ఆత్మవిశ్వాసం కారణంగా వారికి ఇతరులతో సంబంధాలు కూడా సరిగా ఉండవు.
వారు తమ తప్పులను అస్సలు పట్టించుకోరు. ఇలాంటి లక్షణాలు "నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్" సమస్య ఉన్నవారిలో ఎక్కువగా కనిపిస్తాయి. ఈ రుగ్మతను పూర్తిగా నయం చేయడానికి కొన్ని పద్ధతులను అనుసరిస్తారు. తద్వారా దీనిని నియంత్రించడం సాధ్యమవుతుందని సైకాలజిస్టులు వెల్లడిస్తున్నారు.
నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ లక్షణాలను ఎలా గుర్తించాలి..?
- ఇతర వ్యక్తులు తమను చూసి అసూయ పడుతున్నారనే అపోహ వారి మనస్సులో ఉంటుంది.
- ఈ సమస్య ఉన్నవాళ్లు.. తాము చాలా ప్రత్యేకమైన వారిగా, ఇతరులను తక్కువగా పరిగణిస్తుంటారు.
- ఇతరుల పట్ల సానుభూతి ఉండదు.
- ఈ వ్యక్తులు గర్వంగా, మొండి స్వభావంతో ఉంటారు.
- ప్రశంసించకపోతే నిరాశ, ఆందోళనకు గురవుతారు.
నివారణ ఎలా అంటే..?
- ఇతరుల భావాలను అర్థం చేసుకుని, వారిని కూడా గౌరవించాలి.
యోగా, వ్యాయామాన్ని దినచర్యలో భాగంగా చేసుకోవాలి.
- మద్యం లేదా ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి.
- ఊరికే చెప్పడమేకాదు, వినడం కూడా అలవాటు చేసుకోవాలి.
- తప్పులను అంగీకరించడం అలవాటు చేసుకోవాలి.
-ఎక్కువ ప్రశంసలు వినడం మానుకోవాలి.
- ఇతరులతో పోల్చుకోవడం మానేయాలి.
- ఈ రుగ్మతను తగ్గించడంలో టాక్ థెరపీ సమర్థవంతమైన పద్ధతి.
- వీటితోపాటు తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకోవాలి.
ఇది కూడా చదవండి.. లేట్ నైట్ లో ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు ఎందుకు..?
ఇది కూడా చదవండి.. వంట నూనెకు చెడు కొలెస్ట్రాల్ పెరగడానికి లింక్ ఏంటి..?
ఇది కూడా చదవండి.. ఆరోగ్యంగా ఉన్నవాళ్లకు ప్రోటీన్ సప్లిమెంట్లు అవసరంలేదంటున్న వైద్యులు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
