మెదడును ఆరోగ్యంగా ఉంచే అత్యుత్తమ ఆహారం..  

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ఆరోగ్యంగా ఉండాలంటే మన మెదడు ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యం. మనం తినే ఆహారాన్ని బట్టి మన శరీరం రూపుదిద్దుకుంటుందని అంటారు. అదే సమయంలో, మన శరీరం సరిగ్గా పనిచేయడానికి మన మనస్సు ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యం. ఆరోగ్యంగా ఉండటానికి ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం చాలా ముఖ్యం. కానీ మొత్తం శరీరాన్ని నడపడానికి సహాయపడే మెదడు ఆరోగ్యాన్ని కొందరు తేలికగా తీసుకుంటారు.

దానివల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే తప్పనిసరిగా పోషకాహారం తీసుకోవాలని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. మెదడుకు మేలు చేసే కొన్ని ఆహార పదార్థాలను ఖచ్చితంగా తినాలని వారు సూచిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..? 

ఇది కూడా చదవండి.. ప్రీ-మెనోపాజ్ కారణంగా ఎలాంటి సమస్యలు వస్తాయి..? అవేంటి..?

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 

మెదడు పనితీరును మెరుగుపరిచేటటువంటి ఆహారాలను మీ రోజువారీ ఫుడ్ మెనూలో చేర్చుకోవాలని పోషకాహార నిపుణులు వెల్లడిస్తున్నారు. మెదడును ఆరోగ్యంగా ఉంచడంలో లేదా దాని ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడే కొన్ని ఆహారాలను ప్రకృతి మనకు అందించింది. అలాంటి కొన్ని ఆహార పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

కోడి గుడ్లు.. 

కోడిగుడ్లలో విటమిన్ బీ, కోలిన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. బీ విటమిన్ లోపం కారణంగా డిప్రెషన్ ప్రమాదం పెరుగుతుంది. ఇది కాకుండా, మానసిక స్థితి, జ్ఞాపకశక్తికి బాధ్యత వహించే న్యూరోట్రాన్స్మిటర్లను ఉత్పత్తి చేయడానికి శరీరానికి కోలిన్ అవసరం. అది కోడిగుడ్లలో లభిస్తుంది. 

పండ్లు.. 

నారింజ, క్యాప్సికమ్, జామ, కివి, టొమాటో , స్ట్రాబెర్రీ వంటి కొన్ని పండ్లలో విటమిన్ "సి" అధిక మొత్తంలో ఉంటుంది. విటమిన్ "సి" మెదడు కణాలకు నష్టం జరగకుండా చేస్తుంది

 గుమ్మడికాయ గింజలు..

గుమ్మడి గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు అలాగే జింక్, మెగ్నీషియం, కాపర్ ,ఐరన్ ఉన్నాయి. నరాలకు సంకేతాలను ప్రసారం చేయడానికి జింక్, జ్ఞాపకశక్తికి మెగ్నీషియం, నరాల సంకేతాలను నియంత్రించడానికి కాపర్ ,బ్రెయిన్ ఫాగింగ్‌ను నివారించడానికి ఐరన్ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

టీ, కాఫీ.. 

వాస్తవానికి, టీ అండ్  కాఫీ రెండింటినీ అధికంగా ఉపయోగించడం ఆరోగ్యానికి హానికరమే.. ఎందుకంటే వాటిలో ఎక్కువగా కెఫిన్ ఉంటుంది. కానీ పరిమిత పరిమాణంలో తీసుకుంటే, అవి మెదడు పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి. వీటిలో యాంటీఆక్సిడెంట్లు  కూడా ఉంటాయి.

 బ్లూబెర్రీస్.. 

బ్లూబెర్రీస్ లో యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ముఖ్యంగా బ్లూబెర్రీస్ మెదడును యాక్టివ్ గా ఉంచుతూ  వృద్ధాప్యాన్ని రానీయకుండా ఉండడమేకాకుండా, నరాలకు సంబంధించిన వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా సహాయపడతాయి.  

 

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

ఇది కూడా చదవండి..ఒక వ్యక్తికి రోజుకి ఎన్ని కేలరీస్ అవసరం..? 

ఇది కూడా చదవండి..నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.