స్కిజోఫ్రేనియా ఎలాంటి వ్యక్తులకు ఎక్కువగా వస్తుంది..?  

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : స్కిజోఫ్రేనియా లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే మానసిక ఆరోగ్య నిపుణులను సంప్రదించాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా సమయానికి చికిత్స అందించడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చని సైకాలజిస్టులు చెబుతున్నారు. జన్యు: కుటుంబంలో స్కిజోఫ్రేనియా ఉన్న వ్యక్తులు ఉన్నట్లయితే, ఇతరులకు కూడా జన్యుపరంగా ఈ రుగ్మత వచ్చే అవకాశం ఎక్కువ.

ఇది కూడా చదవండి..లివర్ డిటాక్స్ జ్యూస్ రెసిపీ : మీ కాలేయాన్ని న్యాచురల్ గా శుభ్రపర్చుకోండి..

ఇది కూడా చదవండి..Be alert : ఫ్యాటీ లివర్ కారణంగా ముఖంపై కనిపించే 5 సంకేతాలు ఇవే.. 

ఇది కూడా చదవండి..కాలేయంలోని మలినాలను శుభ్రపరచడంలో సహాయపడే విజిటబుల్ జ్యూస్.. 

 

మెదడు రసాయనాలు: డోపమైన్ అండ్ గ్లూటామేట్ వంటి న్యూరోట్రాన్స్‌మిటర్ల అసమతుల్యతలు ఈ రుగ్మతకు కారణమవుతాయి.

మెదడు నిర్మాణం: మెదడులో కొన్ని ప్రాంతాలలో మార్పులు, ముఖ్యంగా గ్రే మ్యాటర్ పరిమాణం తగ్గడం, ఈ రుగ్మతకు సంబంధం కలిగి ఉండవచ్చు.

పర్యావరణం : గర్భం సమయంలో వైరల్ ఇన్ఫెక్షన్స్, పోషక లోపాలు, పుట్టిన తర్వాత మానసిక ఆందోళనలు వంటి అంశాలు స్కిజోఫ్రేనియాకు కారణమవుతాయని నిపుణులు చెబ్తున్నారు.

మాదకద్రవ్యాలు: గంజాయి వంటి మాదకద్రవ్యాల వినియోగం స్కిజోఫ్రేనియాకు కారణమవుతుందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.

  చికిత్సా విధానాలు.. 

స్కిజోఫ్రేనియా పూర్తిగా నయం కావడం కష్టం, కానీ సరైన చికిత్స ద్వారా  లక్షణాలను నియంత్రించవచ్చు. 

యాంటీ-సైకోటిక్ మందులు : హాల్యూసినేషన్లు, డిల్యూషన్లను తగ్గించడానికి ఉపయోగిస్తారు.

సైకోథెరపీ: కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (సిబిటి) వంటి చికిత్సలు వ్యక్తుల ఆలోచనలను సవరించడంలో సహాయపడతాయి.

మద్దతు: కుటుంబ సభ్యులు, మిత్రులు, మానసిక ఆరోగ్య నిపుణుల సహాయం వ్యక్తుల సామాజిక జీవితాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

ఆరోగ్యకరమైన జీవనశైలి : సరైన ఆహారం, వ్యాయామం, నిద్ర నియమాలు, మానసిక శాంతి కోసం ధ్యానం వంటివి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.

ఇది కూడా చదవండి..పేస్‌మేకర్ హార్ట్ పేషెంట్లకు ఎప్పుడు అవసరం..?

ఇది కూడా చదవండి..గుండె జబ్బులు రాకుండా ఉండడానికి వైద్య నిపుణులు చెప్పిన చిట్కాలు..

ఇది కూడా చదవండి..గుండె స్పందన తగ్గినప్పుడు కనిపించే లక్షణాలు..

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.