World Mental Health Day 2025 : ఒత్తిడిని అధిగమించడానికి సరైన మార్గాలు..
సాక్షి లైఫ్ : ఒత్తిళ్లను అధిగమించడానికి లింగ భేదం లేకుండా అందరూ పాటించాల్సిన పద్ధతులున్నాయి. శారీరక ఆరోగ్యంపై దృష్టి పెట్టండి..ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు నడవడం, ఈత కొట్టడం లేదా యోగా చేయడం వల్ల ఒత్తిడి హార్మోన్లు తగ్గి, మానసిక స్థితి మెరుగుపడుతుంది. సరైన నిద్ర.. రోజుకు 7-8 గంటల నాణ్యమైన నిద్ర ఉండేలా చూసుకోండి. నిద్ర లేకపోవడం ఒత్తిడిని మరింత పెంచుతుంది. ఆహారం.. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు ఎక్కువగా తీసుకోండి. కెఫీన్ (టీ, కాఫీ), ఆల్కహాల్ వంటి వాటిని తగ్గించండి.
ఇది కూడా చదవండి..కిడ్నీ వ్యాధి లక్షణాలు: ఈ సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు..
ఇది కూడా చదవండి...బ్యాడ్ ఫుడ్ కాంబినేషన్ : ఎలాంటి ఆహారాలను కలిపి తీసుకోకూడదు
ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..?
మనసు ప్రశాంతంగా..
ధ్యానం, శ్వాస వ్యాయామాలు: రోజుకు 10 నిమిషాలు లోతైన శ్వాస (Deep Breathing) లేదా ధ్యానం (Meditation) చేయడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. మైండ్‌ఫుల్‌నెస్(Mindfulness).. మీరు చేసే పని చేసేటప్పుడు పనిపై గానీ భోజనం చేసేటప్పుడు భోజనంపై, నడిచేటప్పుడు నడకపై ఏకాగ్రత పెట్టాలి. గతం, భవిష్యత్తు గురించి ఆలోచించకుండా వర్తమానంపై దృష్టి పెట్టడం అలవాటు చేసుకోవడం చాలా మంచిది.
'లేదు' అని చెప్పడం నేర్చుకోండి.. మీ శక్తికి మించిన లేదా మీకు ఒత్తిడిని కలిగించే పనుల విషయంలో సున్నితంగా 'లేదు' అని చెప్పడం నేర్చుకోవడం చాలా అవసరం. లేదంటే ఒకరికి ఇచ్చిన మాటకోసం ఆ పని చేయలేక అనవసరమైన ఒత్తిడికి గురవ్వాల్సి వస్తుంది.
సామాజిక మద్దతు(Social support)..
మాట్లాడండి, పంచుకోండి.. పురుషులు తమ భావోద్వేగాలను అణచివేయకుండా, నమ్మకమైన స్నేహితులు లేదా భాగస్వామితో తమ సమస్యలను పంచుకోవడం వల్ల ఒత్తిడి కొంతమేర తగ్గుతుంది. స్త్రీలు తమ భావాలను పంచుకోవడం ద్వారా ఉపశమనం పొందుతారు.
ఇంటి పనిని, పిల్లల బాధ్యతలను భార్యాభర్తలు పంచుకోవడం వల్ల మహిళలపై పని ఒత్తిడి తగ్గుతుంది. చికిత్స, సలహా తీసుకోవడం. ఒత్తిడి తీవ్రంగా ఉండి, అది మీ రోజువారీ జీవితంపై, నిద్రపై, ఆహారపు అలవాట్లపై ప్రభావం చూపుతుంటే, తప్పకుండా కౌన్సిలర్ లేదా సైకాలజిస్ట్ సలహా తీసుకోవాలి. మానసిక ఆరోగ్యం కూడా శారీరక ఆరోగ్యంలాగే ముఖ్యమని గుర్తించండి. ఒత్తిడి అనేది జీవితంలో ఒక భాగం. కానీ దాన్ని ఎలా ఎదుర్కొంటామనేదే మన ఆరోగ్యాన్ని, సంతోషాన్ని నిర్ణయిస్తుంది. ఈ పద్ధతులు పాటించడం ద్వారా మీరు మరింత ప్రశాంతంగా, ఆరోగ్యంగా జీవించవచ్చు.
ఇది కూడా చదవండి..ఆహారంలో అవకాడోను ఎలా చేర్చుకుంటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు అంటే..?
ఇది కూడా చదవండి..హెపటైటిస్ " ఏ" నివారించడంలో వ్యాక్సిన్ పాత్ర ఎంత..?
ఇది కూడా చదవండి..వారానికి రెండుసార్లు తీసుకోవడం ద్వారా అవకాడోతో గుండెపోటుకు చెక్.. !
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
