Scientists Discover Unusual Brain Changes : వెన్నునొప్పితో ‘వినికిడి’కీ ముప్పే.. మెదడులో వింత మార్పులను గుర్తించిన శాస్త్రవేత్తలు..!

సాక్షి లైఫ్ : దీర్ఘకాలిక వెన్నునొప్పి (Chronic Back Pain) అంటే కేవలం వెన్నుపూసకో లేదా కండరాలకో సంబంధించిన సమస్య అని మనం అనుకుంటాం. కానీ, ఈ నొప్పి బాధితుల మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుందని, వారిని శబ్దాల పట్ల అత్యంత సున్నితంగా మారుస్తుందని తాజా పరిశోధనలో తేలింది. సాధారణ వ్యక్తులతో పోలిస్తే, వెన్నునొప్పి బాధితులు రోజువారీ శబ్దాలను చాలా కర్కశంగా, భరించలేనంత ధాటిగా వింటారని యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో అన్షుట్జ్ పరిశోధకులు గుర్తించారు. 'అన్నల్స్ ఆఫ్ న్యూరాలజీ' జర్నల్‌లో ఈ ఆసక్తికర అంశాలు ప్రచురితమయ్యాయి.

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..? 

ఇది కూడా చదవండి..Anti-Aging Strategies : జీవ గడియారాన్ని వెనక్కి తిప్పే శాస్త్రీయ మార్గాలు..?

 

శబ్దాల తీవ్రత పెరగడానికి కారణమేంటి..?

పరిశోధకులు 142 మంది వెన్నునొప్పి బాధితులను, 51 మంది ఆరోగ్యవంతులను పరిశీలించారు. వీరికి ఎంఆర్ఐ (MRI) స్కాన్ చేస్తూ రకరకాల శబ్దాలను వినిపించారు. ఈ క్రమంలో వెన్నునొప్పి బాధితుల మెదడులోని ఆడిటరీ కార్టెక్స్ అంటే శబ్దాలను గ్రహించే భాగం, ఇన్సులా అంటే భావోద్వేగాలను నియంత్రించే భాగం అతిగా స్పందిస్తున్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అదే సమయంలో, ఉద్వేగాలను శాంతపరిచే ప్రీఫ్రంటల్ కార్టెక్స్ పనితీరు మందగించినట్లు తేలింది.

 దీర్ఘకాలిక వెన్నునొప్పి ఉన్నవారిలో మెదడు కేవలం వెన్ను నుంచి వచ్చే సంకేతాలనే కాకుండా, శబ్దాలను కూడా అతిగా విశ్లేషిస్తుంది. అంటే మెదడులో ఒక రకమైన 'వాల్యూమ్' పెరిగిపోతోందని అసిస్టెంట్ ప్రొఫెసర్ యోని అషర్ వివరించారు.

చికిత్స..? 

ఈ సున్నితత్వం శాశ్వతం కాదని, దీనికి పెయిన్ రీప్రాసెసింగ్ థెరపీ (PRT) అద్భుతంగా పనిచేస్తుందని పరిశోధనలో వెల్లడైంది.

పి.ఆర్.టి (PRT)..ఇది ఒక మానసిక చికిత్స. నొప్పి అనేది కేవలం శారీరక గాయం వల్ల మాత్రమే కాకుండా, మెదడులో జరుగుతున్న మార్పుల వల్ల కూడా వస్తుందని బాధితులకు వివరిస్తారు. ఈ చికిత్స పొందిన వారిలో మూడింట రెండు వంతుల మంది నొప్పి నుంచి పూర్తిగా విముక్తి పొందడమే కాకుండా, శబ్దాల పట్ల వారిలో ఉన్న అతి సున్నితత్వం కూడా తగ్గింది.

కొంతమంది పుట్టుకతోనే..

కొంతమంది పుట్టుకతోనే శబ్దాలు, వెలుతురు పట్ల అతిగా స్పందిస్తుంటారు. ఇలాంటి వారు భవిష్యత్తులో వెన్నునొప్పి లేదా ఇతర దీర్ఘకాలిక నొప్పుల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. కేవలం శబ్దాలే కాకుండా.. వాసన, రుచి వంటి ఇతర జ్ఞానేంద్రియాలపై కూడా ఈ ప్రభావం ఉంటుందా? అనే కోణంలో తదుపరి పరిశోధనలు కొనసాగుతున్నాయి.

 వెన్నునొప్పిని కేవలం శారీరక సమస్యగా చూడకుండా, మెదడులోని మార్పులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఈ అధ్యయనం సూచిస్తోంది. సరైన థెరపీ ద్వారా మెదడును తిరిగి మునుపటి స్థితికి తీసుకురావచ్చని నిపుణులు చెబుతున్నారు.

 

ఇది కూడా చదవండి..Weight loss : బరువు తగ్గడం కోసం 'ఫేక్ ఫాస్టింగ్' ఉపయోగపడుతుందా..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఇది కూడా చదవండి..ప్లేట్‌లెట్ కౌంట్ ను ఎలా పెంచుకోవచ్చు..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : hearing-treatment brain-health back-pain hearing-issues brain-hormones
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com