ఒత్తిడిని తగ్గించడంలో అశ్వగంధ ఎలా ఉపయోగపడుతుంది..?
సాక్షి లైఫ్ న్యూస్: అశ్వగంధను ఆయుర్వేదంలో అనేక వ్యాధులను తగ్గించడంలో చికిత్సకు ఉపయోగిస్తారు. అశ్వగంధ తినడం వల్ల లైంగిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.
అశ్వగంధ గుండె ఆరోగ్యానికి కూడా మంచిది. మీరు అశ్వగంధను తీసుకోవడం వల్ల కండరాలు దృఢంగా మారుతాయి. అంతేకాదు మనస్సు అదుపులో ఉంటుంది. అంతే కాదు, అశ్వగంధ తినడం వల్ల ఒత్తిడి ,ఆందోళన నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
మంచి నిద్రకు సరైన ఔషధం..
మంచి నిద్రకు సరైన ఔషధం అశ్వగంధ. ఇది తీసుకోవడం వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. మీరు కూడా ఒత్తిడి లేదా ఆందోళనతో బాధపడుతుంటే, మీరు తప్పనిసరిగా మీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవాలి. అశ్వగంధ తినే విధానాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
మానసిక సమస్యలను పరిష్కారం..
అశ్వగంధ ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక సమస్యలను పరిష్కరిస్తుంది. అశ్వగంధ తినడం వల్ల కార్టిసాల్ హార్మోన్ స్థాయి తగ్గుతుంది. కార్టిసాల్ అనేది ఒక ఒత్తిడి హార్మోన్. శరీరంలో కార్టిసాల్ పెరిగినప్పుడు, ఒత్తిడి, ఆందోళన పెరగడం ప్రారంభమవుతుంది.
అటువంటి పరిస్థితిలో అశ్వగంధ తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుందని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు. అశ్వగంధ మనస్సును ప్రశాంతంగా ఉంచి డిప్రెషన్ నుంచి ఉపశమనం కల్పిస్తుంది.
అశ్వగంధను నీటిలో మరిగించి.. తీసుకోవాలి..
ఒత్తిడిని తగ్గించుకోవడానికి అశ్వగంధను నీటిలో వేసి మరిగించి తినవచ్చు. ఇందుకోసం అర టీస్పూన్ అశ్వగంధ పొడిని తీసుకోవాలి. దీన్ని 2 కప్పుల నీటిలో వేసి మరిగించాలి. నీరు సగానికి తగ్గే వరకు మరగబెట్టండి. ఇప్పుడు ఈ నీటిని ఫిల్టర్ చేసి తీసుకోవాలి.
అశ్వగంధ- తేనె..
అశ్వగంధలో తేనె కల్పి తీసుకోవడం ద్వారా కూడా మీరు ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చు. దీని కోసం, అశ్వగంధ పొడి లేదా వేర్లు తీసుకోండి. ఇప్పుడు నీళ్లలో వేసి మరిగించి, వడపోసి గ్లాసులోకి తీసుకోవాలి. ఇప్పుడు అందులో తేనె మిక్స్ చేసి తాగాలి. మీరు ఇలా ప్రతిరోజూ తీసుకుంటే ఒత్తిడి తగ్గిపోతుంది.
అశ్వగంధ-పాలు
మీరు అశ్వగంధ పొడిని , పాలలో కలిపి తీసుకోవడం ద్వారా కూడా ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చు. దీని కోసం మీరు ఒక గ్లాసు వేడి పాలను తీసుకోండి. అందులో అర టీస్పూను అశ్వగంధ పొడి వేయాలి. ఆ పాలు తాగాలి. అశ్వగంధ, పాలు కలిపి తీసుకోవడం వల్ల ఆందోళన,ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది.
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
