సాక్షి లైఫ్ : జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజల్లో ఒత్తిడి సమస్య పెరుగుతోంది. నేటి బిజీ లైఫ్‌లో, పనిలో చాలా బిజీగా ఉండి.. ఒక్కోసారి ఆరోగ్యాన్ని పట్టించుకోలేకపోతున్నారు. దీంతో పలురకాల అనారోగ్యసమస్యలను ఎదుర్కొవాల్సి వస్తోంది. ప్రతి వ్యాధికి ప్రధాన కారణాల్లో మొదటిది టెన్షన్. ఒత్తిడి అంటే ఏమిటో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
ఒత్తిడి-ఆందోళనకు అనేక కారణాలున్నాయి. అటువంటి వాటిలో చేసే పని, తీసుకునే ఆహారం కూడా తీవ్ర ప్రభావం చూపుతాయి. ఒత్తిడి గురయ్యేవాళ్ళు తప్పనిసరిగా కొన్నిరకాల ఆహారాలను తీసుకోకపోవడమే ఉత్తమమని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
ఇది కూడా చదవండి..లిపోప్రోటీన్ గ్లోమెరులోపతి అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి..ఆర్థరైటిస్ చికిత్సలో స్టెమ్ సెల్ థెరపీని ఉపయోగించడంలో ఎలాంటి సవాళ్లు ఉన్నాయి?..
ఇది కూడా చదవండి..మీ కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి 7 మార్గాలు
ఇది కూడా చదవండి..అల్లోపతి, యునాని చికిత్సా విధానాల మధ్య ముఖ్యమైన తేడాలు ఏమిటి?
ఆలోచన విధానం..
ఒత్తిడి అంటే శారీరకంగా, మానసికంగా ఆందోళన చెందడం. ఈ భావన ఏదైనా సంఘటన లేదా ఆలోచన నుంచి వస్తుంది. అది ఒక వ్యక్తిలో నిరాశ, కోపం, ఆత్రుతను పెంచుతుంది. దీనికి కారణం ఆలోచనా విధానం. తలనొప్పి, కోపం, నిద్రలేమి, ఏడుపు మొదలైనవి దీని వల్ల తలెత్తవచ్చు.
ఒత్తిడిని నివారించాలనుకుంటే..?
ఒత్తిడిని నివారించాలనుకుంటే, ప్రతిరోజూ తీసుకునే ఆహారంలో ఆరోగ్యకరమైన ఆహారాన్ని చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే మీ సమస్యను మరింతగా పెంచే ఆహారాలను తీసుకోకుండా ఉండడం కూడా ముఖ్యమని వారు చెబుతున్నారు. కాబట్టి ఒత్తిడి సమస్యను పెంచే కొన్ని ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఒత్తిడిని పెంచే ఆహారాలు..
-తీపి పదార్థాలు..
అతిగా తీపి పదార్థాలు తినడం కూడా ఆరోగ్యానికి అంతమంచిది కాదు. స్వీట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. తీపి పదార్థాలు చక్కెర స్థాయిలను పెంచడమే కాకుండా ఒత్తిడిని కూడా పెంచుతాయి.
-కాఫీ..
కాఫీ ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు. కానీ చాలా మంది కాఫీని అధికంగా తీసుకుంటూ ఉంటారు. ఇది ఆరోగ్యానికి చాలా హానికరం. కాఫీ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. కాఫీ ఎక్కువగా తాగితే నిద్రలేమి సమస్యలు తలెత్తి ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉంటుంది.
-మద్యం..
నిజానికి, ఆల్కహాల్ ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి హానికరం. అధికంగా మద్యం సేవించడం వల్ల ఒత్తిడి, చిరాకు పెరుగుతుంది. ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి.
-జంక్ ఫుడ్..
జంక్ ఫుడ్ , ఫాస్ట్ ఫుడ్ తీసుకోవడం నేటి కాలంలో ట్రెండ్‌గా మారింది. మన బిజీ లైఫ్ , బిజీ లైఫ్ స్టైల్ వల్ల ఫాస్ట్ ఫుడ్ తినడానికి చాలా మంది అలవాటు పడుతున్నారు. అయితే ఫాస్ట్ ఫుడ్ అధికంగా తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం.. ఎందుకంటే..? ఇది ఒత్తిడి స్థాయిలను మరింతగా పెంచుతుంది.
ఇది కూడా చదవండి..రక్తంలో ఆక్సిజన్ తగ్గినప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయి..?
ఇది కూడా చదవండి..నల్ల బియ్యం వల్ల కలిగే ప్రయోజనాలు..
ఇది కూడా చదవండి..ఫర్ హార్ట్ హెల్త్ : జిమ్‌కు వెళ్లినప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com