Boost Immunity : రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్ సి10 ఉత్తమమైన సహజ వనరులు..
సాక్షి లైఫ్ : విటమిన్ సి (ఆస్కార్బిక్ ఆమ్లం) శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ మాత్రమే కాదు, రోగనిరోధక శక్తిని పెంచడానికి, కొల్లాజెన్ ఉత్పత్తికి ఇనుము శోషణకు కూడా ఇది చాలా అవసరం. విటమిన్ సి అధికంగా ఉండే 10 ఉత్తమ సహజమైన ఆహార వనరులను గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి..హార్ట్ ఎటాక్ తర్వాత తొలి 60 నిమిషాలు ఎందుకంత కీలకం..?
ఆమ్లా (ఉసిరి) ఇండియన్ గూస్‌బెర్రీ (Amla/Indian Gooseberry).. విటమిన్ సి కి అత్యుత్తమ, శక్తివంతమైన వనరులలో ఇది ఒకటి. దీనిని పచ్చిగా లేదా జ్యూస్ రూపంలో తీసుకోవడం వలన తక్షణ రోగనిరోధక శక్తి పెరుగుతుంది.రెడ్ బెల్ పెప్పర్స్ (Red Bell Peppers).. నారింజ పండ్ల కంటే రెడ్ బెల్ పెప్పర్లలో విటమిన్ సి రెట్టింపు కంటే ఎక్కువగా ఉంటుంది. వీటిని సలాడ్లలో లేదా కూరగాయలలో ఉపయోగించవచ్చు. కివీ ఫ్రూట్ (Kiwi Fruit).. ఈ పండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. జీర్ణక్రియకు నిద్ర నాణ్యతను మెరుగుపరచడానికి కూడా ఇది సహాయపడుతుంది.
ఆరెంజ్ (Oranges)..అత్యంత ప్రజాదరణ పొందిన విటమిన్ సి వనరు. దీనిని పండుగా గానీ లీదంటే జ్యూస్‌గా తీసుకోవచ్చు. నిమ్మకాయ (Lemon) పుల్లని పండ్లు (Citrus Fruits).. నిమ్మకాయ, ద్రాక్షపండు (Grapefruit) వంటి పండ్ల రసాలు రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. స్ట్రాబెర్రీలు (Strawberries)..ఈ పండ్లలో విటమిన్ సి తో పాటు శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి గుండె ఆరోగ్యానికి మంచివి.బ్రోకలీ (Broccoli)..ఇది విటమిన్ సి కి మంచి వనరు మాత్రమే కాక, ఇందులో ఉండే ఫైబర్, ఇతర విటమిన్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
పైనాపిల్ (Pineapple).. ఈ ఫ్రూట్ లో విటమిన్ సితో పాటు 'బ్రోమెలైన్' అనే ఎంజైమ్ ఉంటుంది, ఇది జీర్ణక్రియకు, ఇన్ఫ్లమేషన్ ను తగ్గించడానికి సహాయపడుతుంది.పచ్చి బఠానీలు (Green Peas).. పచ్చి బఠానీలు కేవలం ప్రోటీన్‌కే కాక, విటమిన్ సికి కూడా మంచి వనరు. బొప్పాయి (Papaya)..ఈ పండులో విటమిన్ సితో పాటు, 'పాపైన్' అనే ఎంజైమ్ ఉంటుంది, ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి..Revisiting Old Books: మానసిక ఆరోగ్యానికి ' చదివిన పుస్తకాలు మళ్లీ చదవడం' దివ్యౌషధం..
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
