నల్ల బియ్యంలో 23 రకాల యాంటీ ఆక్సిడెంట్లు 

షేర్ చేయండి:
నల్ల బియ్యంలో 23 రకాల యాంటీ ఆక్సిడెంట్లు 

సాక్షి లైఫ్ : నల్ల బియ్యంలో ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. అంతేకాదు ఇతర బియ్యం కంటే ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది. అంతేకాదు 23 రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. బ్లాక్ రైస్ గుండె ఆరోగ్యానికి కూడా మంచిదని చెబుతున్నారు. ద్రాక్ష, మామిడిపండ్లకు ముదురు వైలెట్ రంగును ఇచ్చే ఆంథోసైనిన్, ఈ బియ్యం విషయంలో నలుపు రంగును ఇస్తుంది.

ఇది కూడా చదవండి..వెరికోస్ వెయిన్స్ కు ప్రధాన కారణాలు..?  

ఇది కూడా చదవండి..స్ట్రోక్ కు ప్రధాన కారణాలు..? నివారణ ఎలా..? 

ఇది కూడా చదవండి..కిడ్నీడ్యామేజ్ అయ్యే ముందు కనిపించే 5 లక్షణాలు.. 

ఇది కూడా చదవండి..పక్షవాతంలో ఎన్ని రకాలు ఉన్నాయి..? 

ఇది కూడా చదవండి..ఎక్కువసేపు స్క్రీన్ పై గడపడం వల్ల ఎలాంటి రోగాలు వస్తాయి..?

 

ఇటీవల మార్కెట్‌లో ముడి బియ్యం తోపాటు అనేక రకాలు అందుబాటులో ఉన్నాయి. అటువంటివాటిలో నల్ల బియ్యం కూడా ఒకటి. ఈ బియ్యంలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అధిక ఫైబర్ కలిగి ఉన్న ఈ బియ్యం మధుమేహంతో సహా అనేక వ్యాధులను నయం చేస్తుందట. నల్ల బియ్యం ఎక్కువగా చైనా, భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలతో సహా దక్షిణాసియా దేశాలలో పండిస్తున్నారు. అంతేకాదు వీటిని కేరళలోని కొన్ని ప్రాంతాల్లో కూడా సాగు చేస్తున్నారు.


బ్లాక్ రైస్ బెనిఫిట్స్..

నల్ల బియ్యం మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరం. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, ప్రొటీన్లు, ఐరన్ కూడా ఉంటాయి. ఈ పోషకాలతో పాటు, బ్లాక్ రైస్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు కూడా ఉన్నాయి.

ఇది ఫ్రీ రాడికల్స్ నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. పావు కప్పు అన్నంలో ప్రోటీన్, కొవ్వు, కార్బోహైడ్రేట్లు, సహజ ఫైబర్, ఇనుము లభిస్తాయి. బ్లాక్ రైస్‌లో ఉండే అధిక ఫైబర్ బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

ఈ నల్ల బియ్యంలో గ్లూటెన్ ఉండదు. బరువు తగ్గదాంతోపాటు మధుమేహంతో సహా అనేక వ్యాధులు నయమవుతాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో బ్లాక్ రైస్ ఎంతగానో ఉపయోగ పడుతాయి. ఈ బియ్యం చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కూడా సహాయపడుతాయి.

 

ఇది కూడా చదవండి..కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడే న్యాచురల్ ఫుడ్..?

 

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనలకు బెస్ట్ సొల్యూషన్ 

ఇది కూడా చదవండి..సైనసిటిస్ ఎన్నిరకాలున్నాయంటే..?

ఇది కూడా చదవండి..మందులతో పని లేకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గేదెలా..?

 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.