భారతీయులలో సాధారణంగా కనిపించే 5 రకాల పోషకాల లోపాలు
సాక్షి లైఫ్ : మన శరీరంలో అన్ని పోషకాలు సరైన పరిమాణంలో ఉండటం ద్వారా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండొచ్చు. అయితే, అనేక కారణాల వల్ల, కొన్నిసార్లు శరీరంలో ఈ పోషకాల లోపం ఉంటుంది. వాటి లోపం వల్ల, అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. భారతీయులలో సాధారణంగా కనిపించే 5 రకాల పోషకాల లోపాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..క్యాన్సర్ కు సరికొత్త చికిత్స.. ప్రయోగంలో సత్ఫాలితాలు సాధించిన భారతదేశం..
ఇది కూడా చదవండి..మహిళల్లో జుట్టు రాలడానికి ప్రధాన కారణాలు ఏమిటి..?
ఇది కూడా చదవండి..రోగనిరోధక శక్తి ప్రాధాన్యత తెలుసా..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇనుము..
భారతదేశంలో పోషకాహార పరంగా ఇనుము లోపం అతిపెద్ద సవాళ్లలో ఒకటి. ముఖ్యంగా స్త్రీలు,పిల్లలలో ఇనుము లోపం సర్వసాధారణం. శరీరానికి ఆక్సిజన్ సరఫరా చేయడంలో ఇనుము ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. దీని లోపం రక్తహీనతకు కారణమవుతుంది, దీని లక్షణాలు అలసట, బలహీనత, శ్వాస ఆడకపోవడం.
విటమిన్ "డి"..
ఎముకల ఆరోగ్యానికి విటమిన్ "డి" చాలా అవసరం. సూర్యకాంతి నుంచి శరీరంలో విటమిన్ "డి" ఉత్పత్తి అవుతుంది, కానీ సూర్యకాంతిలో తక్కువ సమయం గడపడం, అసలు సూర్యరశ్మి తగల కుండా ఉండడం వంటి అనేక కారణాల వల్ల భారతీయులలో విటమిన్ "డి "లోపం తలెత్తుతుంది. దీని లోపం ఎముకలు బలహీనపడటానికి (ఆస్టియోపోరోసిస్), కండరాల నొప్పికి కారణమవుతుంది. ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని పెంచుతుంది.
విటమిన్ బి12..
విటమిన్ బి12 లోపం ఎక్కువగా శాఖాహారులలోనే కనిపిస్తుంది. ఈ విటమిన్ నాడీ వ్యవస్థ, కండరాల బలం, ఎర్ర రక్త కణాల తయారీ, శక్తిని పెంచడానికి చాలా అవసరం. దీని లోపం వల్ల నోటిలో పుండ్లు, అలసట, బలహీనత, జ్ఞాపకశక్తి తగ్గడం, చేతులు, కాళ్ళలో జలదరింపు వంటి అనేక సమస్యలు వస్తాయి.
ఫోలేట్..
కణాల పెరుగుదలకు ఫోలేట్ చాలా అవసరం, గర్భిణీ స్త్రీలకు ఇది చాలా ముఖ్యం. దీని లోపం వల్ల నవజాత శిశువులలో పుట్టుకతోనే కొన్నిరకాల వ్యాధులు వస్తాయి. విటమిన్ బి12, విటమిన్ "డి" లతో పాటు, ఇది ఎర్ర రక్త కణాలను తయారు చేయడంలో సహాయపడుతుంది.
ప్రోటీన్..
కండరాలను నిర్మించడానికి ప్రోటీన్ కీలక పాత్రపోషిస్తుంది. ప్రోటీన్‌లో ఉండే అమైనో ఆమ్లాలు శరీరం అనేక విధులు నిర్వహించడానికి చాలా అవసరం. అందువల్ల, శరీరంలో ప్రోటీన్ లేకపోవడం వల్ల పలురకాల సమస్యలు తలెత్తుతాయి. పిల్లల పెరుగుదలలో ప్రోటీన్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. దీని లోపం కండరాల బలహీనత, బరువు తగ్గడం, రోగనిరోధక శక్తి బలహీనపడటానికి దారితీస్తుంది.
ఇది కూడా చదవండి..నిద్ర నాణ్యత ఇన్ఫ్లమేషన్ కు ఎలా దారితీస్తుంది..?
ఇది కూడా చదవండి..పోషకాలు : జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో సహాయపడే నిర్దిష్ట విటమిన్లు లేదా ఖనిజాలుఏమిటి..?
ఇది కూడా చదవండి..మాన్ సూన్ సీజన్‌లో వచ్చే సాధారణ వ్యాధులు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
