సాక్షి లైఫ్ : కిడ్నీలు ఆరోగ్యంగా ఉండడం చాలా ముఖ్యం. ఎందుకంటే కిడ్నీలు మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుతాయి. అంతేకాదు బాడీలోని విషాలను తొలగించడానికి సహాయపడతాయి. కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కొన్ని రకాల జాగ్రత్తలు అవసరం. అటువంటివాటిలో రోజుకు కనీసం 8-10 గ్లాసుల నీరు తాగాలి. ఇలా తాగడం ద్వారా కిడ్నీలు హైడ్రేటెడ్‌గా ఉంటాయి.
ఇది కూడా చదవండి..అల్లోపతి, యునాని వైద్యం రోగ నిర్ధారణ, చికిత్సను ఎలా అనుసరిస్తాయి?
ఇది కూడా చదవండి..అల్లోపతి ప్రాక్టీషనర్లు సాధారణంగా రోగులతో ఎలా వ్యవహరిస్తారు..?
ఇది కూడా చదవండి..ఫర్ హార్ట్ హెల్త్ : జిమ్‌కు వెళ్లినప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి.
ఉప్పు నియంత్రణ: ఉప్పు మోతాదు తగ్గించాలి. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. ఆహారంలో ప్రోటీన్ నియంత్రణ: అధిక ప్రోటీన్ తీసుకోవడం కారణంగా కిడ్నీపై ఒత్తిడి పడే అవకాశం ఉంటుంది.
మధుమేహం, రక్తపోటు వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు రెండిటీని అదుపులో ఉంచుకోవాలి. శారీరక వ్యాయామాన్ని పెంచాలి. తద్వారా కిడ్నీలకే కాదు శరీరం మొత్తానికి ఆరోగ్యం కూడా. మంచి నిద్ర కూడా కిడ్నీ ఆరోగ్యానికి చాలా ముఖ్యమే.
ఇందులో కిడ్నీ పనితీరు పరీక్షను ఎప్పటికప్పుడు చేసుకోవడంతోపాటు జీవనశైలిలో అవసరమైన మార్పులు చేయడమేకాకుండా ఆహారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కొన్నిరకాల ఆహారపదార్థాలను అతిగా తీసుకుంటే కిడ్నీలు పాడయ్యే ప్రమాదం ఉంది. అవేంటంటే..?
ఈ ఆహార పదార్థాలు.. అస్సలు వద్దు
మన ఆహారపు అలవాట్లు నేరుగా మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. ఊబకాయం, మధుమేహం, చెడు కొలెస్ట్రాల్ మొదలైన అనేక సమస్యలు మనం తీసుకునే ఆహారంతో ముడిపడి ఉంటాయి. మీ మూత్రపిండాలు ఆరోగ్యాంగా ఉండాలంటే మీరు కొన్ని ఆహారపదార్థాలను నియంత్రించాలి.
ఫాస్ట్ ఫుడ్..
బిజీ లైఫ్ స్టైల్ కారణంగా ఇంట్లో వంట చేసుకోవడం మానేసి కొందరు ఫాస్ట్ ఫుడ్ బెస్ట్ ను ఆప్షన్ గా ఎంచుకుంటున్నారు. పిజ్జా, బర్గర్, మోమోస్ తింటే భిన్నమైన అనుభూతి కలుగుతుంది. ఫాస్ట్ ఫుడ్ అధికంగా తీసుకోవడం వల్ల స్థూలకాయం, మధుమేహం, రక్తపోటు వంటి సమస్యలు వస్తాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు మూత్రపిండాలు కూడా ఈ ఫాస్ట్ ఫుడ్ కారణంగా దెబ్బతింటాయని వారు చెబుతున్నారు.
ఎందుకంటే వీటిలో సోడియం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మూత్రపిండాలకు హానికరం. కిడ్నీ సమస్యలు రాకుండా ఉండాలంటే ఇంట్లో తయారుచేసిన ఆహారాన్ని తీసుకోవాలి. అంతేకాదు నూనె, ఉప్పు, మసాలాలు తక్కువగా తినండి.
శీతల పానీయాలు లేదా సోడా..
శీతల పానీయాలు లేదా సోడా ఎక్కువగా తాగడం కూడా కిడ్నీ ఆరోగ్యానికి మంచిది కాదు. ఎందుకంటే ఇందులో భాస్వరం ఉంటుంది, ఇది మూత్రపిండాలకు హానికరం. మీరు ఇప్పటికే మూత్రపిండాల సమస్యలతో బాధపడుతున్నట్లయితే, సోడాను అస్సలు తీసుకోకండి.
టొమాటో..
టొమాటో కూరల్లోనే కాకుండా సలాడ్‌లలో కూడా ఉపయోగిస్తారు. అయితే కిడ్నీ సంబంధిత సమస్యల విషయంలో టమాట అస్సలు తినకూడదు. మొదటిది, టొమాటోలో ఎక్కువగా పొటాషియం ఉంటుంది. ఇది మూత్రపిండాలను బలహీనపరుస్తుంది. రెండవది, టమోటా గింజలు సులభంగా జీర్ణం కావు. దీని వల్ల కిడ్నీలు తమ పనిని సక్రమంగా చేయలేవు.
బ్రెడ్..
కొంతమంది బ్రెడ్ ఎక్కువగా తీసుకుంటారు. దీనితో అనేక రకాల వంటకాలు తయారు చేస్తారు. ఇది మూత్రపిండాల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ఫైబర్‌తో పాటు, పాస్పరస్ , పొటాషియం బ్రెడ్‌లో ఎక్కువ పరిమాణంలో ఉంటాయి. ఇవి మూత్రపిండాల ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని పెంచుతాయి.
ఆరెంజ్..
ఆరెంజ్ విటమిన్ సిమూలం. ఇది చర్మానికి మంచిది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది, అయితే ఇన్ని ప్రయోజనాలున్నప్పటికీ, ఈ పండు మూత్రపిండాలకు మంచిది కాదు. నారింజ రుచి పుల్లగా ఉంటుంది కాబట్టి, కిడ్నీ రోగులకు దగ్గు వచ్చే అవకాశం ఉంది.
అవకాడో..
ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లతో సహా అనేక పోషకాలు ఇందులో ఉన్నాయి. మామూలు సైజ్ లో ఉన్న అవోకాడోలో పొటాషియం 690 mg ఉంటుంది. దీని వల్ల కిడ్నీలకు హాని కలిగే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి..రోగనిరోధక శక్తి ప్రాధాన్యత తెలుసా..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com