సాక్షి లైఫ్ : మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు పెరిగిపోతున్న ఒత్తిడి కారణంగా ఈ రోజుల్లో చిన్న వయసులోనే అనేక దీర్ఘకాలిక వ్యాధులు (Non-Communicable Diseases - NCDs) పంజా విసురుతున్నాయి. డయాబెటిస్, అధిక రక్తపోటు, గుండె సమస్యలు, క్యాన్సర్ వంటి వాటిని ముందుగానే గుర్తించి, చికిత్స తీసుకోవాడానికి, ప్రాణాపాయం నుంచి బయట పడడానికి ప్రతి సంవత్సరం కచ్చితంగా ఆరోగ్య పరీక్షలు (Annual Health Checkups) చేయించుకోవడం చాలా ముఖ్యం.
ఇది కూడా చదవండి..పంచదార, తేనె, మాంక్ ఫ్రూట్ లలో.. ఆరోగ్యకరమైన స్వీటెనర్ ఏది..?
ఇది కూడా చదవండి..New study : బోన్ స్ట్రెంత్ విషయంలో గట్ హెల్త్ పాత్ర కీలకం..
ఇది కూడా చదవండి..ఏట్రియల్ కార్డియోమయోపతి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
30 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా మహిళలు, కొన్ని కీలకమైన వైద్యపరీక్షలను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ పరీక్షలను ఏడాదికొకసారి లేదా వైద్యులు సూచించిన విధంగా కచ్చితంగా చేయించుకోవాలి. అందరికీ తప్పనిసరి (30 ఏళ్లు దాటిన వారికి)వీటిని 'బేసిక్ స్క్రీనింగ్'గా పరిగణించాలి.పరీక్ష పేరుఎందుకు చేయించాలి?
కంప్లీట్ బ్లడ్ పిక్చర్ (Cbp) రక్తహీనత అంటే అనీమియా, ఇన్ఫెక్షన్లు, ప్లేట్‌లెట్ సంఖ్య, మొత్తం ఆరోగ్యం తెలుసుకోవడానికి. రక్తహీనత, ఇన్ఫెక్షన్లు.
HbA1c: గ్లైకోసైలేటెడ్ హిమోగ్లోబిన్..
బ్లడ్ షుగర్ (Fasting & PP)మధుమేహం (డయాబెటిస్) ఉందా లేదా అని తెలుసుకోవడానికి. గత 2 నుంచి 3 నెలల్లో రక్తంలో చక్కెర స్థాయిలను కొలిచే ఒక రక్త పరీక్ష. ఇది మధుమేహాన్ని నిర్ధారించడానికి, పర్యవేక్షించడానికి, నిర్వహించడానికి, అలాగే ప్రీ-డయాబెటిస్ ను పరీక్షించడానికి ఉపయోగపడుతుంది. అయితే సాధారణ పరిధి 5.7% కంటే తక్కువగా ఉంటే నార్మల్ గా పరిగణిస్తారు.
లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్..
కొలెస్ట్రాల్ మంచి (HDL), చెడు కొలెస్ట్రాల్ (LDL) కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలను కొలవడానికి. అధిక కొవ్వు గుండె జబ్బులకు కారణమవుతుంది.
గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదం..
రక్తపోటు (Blood Pressure - BP)అధిక రక్తపోటును గుర్తించడానికి. గుండె, కిడ్నీ సమస్యలను గురించి తెలుసుకోవడానికి.
థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ (TFT)..
థైరాయిడ్ గ్రంథి పనితీరు తెలుసుకోవడానికి. (ముఖ్యంగా మహిళలకు)బరువు పెరగడం/తగ్గడం, అలసట, హార్మోన్ల సమస్యలు తలెత్తుతుంటాయి. అటువంటప్పుడు ఇలాంటి టెస్టులు చేయించాలి.
లివర్ & కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ (LFT & KFT)కాలేయం, మూత్రపిండాల ఆరోగ్యాన్ని అంచనా వేయడానికి. కాలేయ సంబంధిత, కిడ్నీ సమస్యలు.మహిళలకు తప్పనిసరి పరీక్షలు (వయసును బట్టి)మహిళల్లో కొన్ని క్యాన్సర్‌లు ఎక్కువగా కనిపిస్తున్నందున, ముందస్తు గుర్తింపు కోసం ఈ పరీక్షలు కీలకం.
మామోగ్రఫీ..
రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్40 ఏళ్లు పైబడిన వారికి లేదా కుటుంబ చరిత్ర ఉంటే అంతకంటే ముందు రొమ్ము క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించడానికి మామోగ్రఫీ (Mammography) పరీక్ష. ప్రతి నెలా స్వీయ-పరీక్ష (Self-Examination) తప్పనిసరి.
ప్యాప్ స్మియర్ (Pap Smear)..
గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ స్క్రీనింగ్ 21 ఏళ్ల నుంచి ప్యాప్ స్మియర్ (Pap Smear).. గర్భాశయ కణాలలో మార్పులను గుర్తించడానికి.
HPV టెస్ట్ను 30 ఏళ్లు దాటిన తర్వాత పాప్ స్మియర్‌తో కలిపి ప్రతి 5 ఏళ్లకు ఒకసారి చేయించుకోవచ్చు. బోన్ డెన్సిటీ టెస్ట్ మెనోపాజ్ తర్వాత సుమారు 50-65 ఏళ్లు ఈస్ట్రోజెన్ స్థాయిలు తగ్గడం వల్ల వచ్చే ఆస్టియోపొరోసిస్ (ఎముకల బలహీనత)ను గుర్తించడానికి DEXA స్కాన్ చేస్తారు.
పురుషులకు ముఖ్యమైన పరీక్షలు..
(40 ఏళ్లు దాటిన వారికి)పరీక్ష ప్రోస్టేట్ క్యాన్సర్ స్క్రీనింగ్50 ఏళ్ల నుంచి కుటుంబ చరిత్ర ఉంటే 40 ఏళ్ల నుంచే PSA (Prostate-Specific Antigen) రక్త పరీక్ష ద్వారా ప్రోస్టేట్ గ్రంథిలో అసాధారణ లక్షణాలను గుర్తిస్తారు.
కొలొరెక్టల్ క్యాన్సర్ స్క్రీనింగ్..
45-50 ఏళ్ల నుంచిపెద్ద పేగులో పాలిప్‌లు లేదా క్యాన్సర్ ఉనికిని గుర్తించడానికి మల రక్త పరీక్ష (FIT Test) లేదా కొలొనోస్కోపీ (Colonoscopy) చేయించుకోవాలి. చాలామంది అలసట, నొప్పులు వంటి లక్షణాలను సాధారణంగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు. క్యాన్సర్‌లు, మధుమేహం వంటి వ్యాధులు ప్రారంభంలో ఎలాంటి లక్షణాలు చూపకపోవచ్చు, అందుకే వార్షిక పరీక్షలు అవసరం.
మీరు ఏ పరీక్షలు చేయించుకోవాలి, ఎంత తరచుగా చేయించుకోవాలి అనేది మీ వయస్సు, కుటుంబ చరిత్ర (Family History), జీవనశైలి ఇప్పటికే ఉన్న అనారోగ్య సమస్యలపై ఆధారపడి ఉంటుంది. ఇలాంటప్పుడు వైద్యుడిని సంప్రదించి, వారికి తగిన విధంగా 'ప్రీవెంటివ్ హెల్త్ ప్లాన్' రూపొందించుకోవాలి.
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com