Heartbeat : హార్ట్ బీట్ ఆధారంగా పుట్టబోయేది బాబు లేదా పాప అని చెప్పవచ్చా..? 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : గర్భంలో ఉన్న శిశువు హృదయ స్పందన (heartbeat) ఆధారంగా పుట్టబోయేది బాబు లేదా పాప అని చెప్పవచ్చా..? ఈ ప్రచారం చాలా కాలంగా ఉన్నప్పటికీ, ఇందులో ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేదు. వైద్యుల ప్రకారం, హార్ట్ బీట్ ద్వారా శిశువు ఏ లింగమనేది పసిగట్టడం అసాధ్యం.

 

ఇది కూడా చదవండి..నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?

ఇది కూడా చదవండి..జన్యుపరమైన సమస్యలను ఏవిధంగా అధిగమించాలంటే..?

ఇది కూడా చదవండి..వర్షం పడినప్పుడు జలుబు, దగ్గు ఎందుకు వస్తాయి..?

 

ప్రచారంలో ఉన్న అపోహ...

శిశువు హృదయ స్పందన నిమిషానికి 140 బీట్స్ (BPM) కంటే ఎక్కువగా ఉంటే ఆడపిల్ల అని, అంతకంటే తక్కువగా ఉంటే మగపిల్లవాడు అని చాలామంది నమ్ముతుంటారు. కానీ, దీన్ని లింగ నిర్ధారణకు సరైన పద్ధతిగా వైద్యశాస్త్రం అంగీకరించదు.

హార్ట్ బీట్ ఎందుకు మారుతుందంటే..?

గర్భధారణ సమయంలో శిశువు ఫీటల్ హార్ట్ రేట్ ఎప్పుడూ ఒకేలా ఉండదు. హృదయ స్పందన రేటులో మార్పులు రావడానికి ప్రధాన కారణాలు..

గర్భధారణ దశ..

కడుపులో శిశువు చేసే కదలికలు.. స్కానింగ్ సమయంలో శిశువు ఉన్న భంగిమ..ఈ కారణాల వల్ల హార్ట్ బీట్ 150 లేదా 160 BPM దాటినా అది ఆడపిల్లకి సంకేతం కాదు, అలాగే 130 BPM ఉన్నంత మాత్రాన మగపిల్లాడు అని నిర్ధారించలేము.

వైద్యులు హార్ట్ బీట్ ను ఎందుకు పర్యవేక్షిస్తారు..?

శిశువు హృదయ స్పందనను డాక్టర్లు కేవలం శిశువు ఆరోగ్యం, ఎదుగుదల ఎలా ఉందో తెలుసుకోవడానికి మాత్రమే పర్యవేక్షిస్తారు. దీని ద్వారా బిడ్డ సురక్షితంగా ఉన్నదో లేదో, గర్భధారణ సజావుగా సాగుతోందో లేదో తెలుస్తుంది. ఇది కేవలం ఒక మెడికల్ పారామీటర్ మాత్రమే. 140 BPM ఫార్ములా అనేది గర్భధారణకు సంబంధించి ప్రజల్లో నాటుకుపోయిన ఒక సాధారణ అపోహ మాత్రమే. వేర్వేరు పిల్లల హృదయ స్పందన రేటులో సహజంగానే వ్యత్యాసాలు ఉంటాయి. కాబట్టి హార్ట్ బీట్ ను కేవలం బిడ్డ ఆరోగ్య సూచికగానే చూడాలి తప్ప, లింగ నిర్ధారణ కోసం కాదని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.

ఇది కూడా చదవండి..క్రానిక్ సైనసిటిస్ కు అక్యూట్ సైనసిటిస్ తేడా ఏంటి..?

ఇది కూడా చదవండి..దీర్ఘకాలిక వ్యాధులు రాకుండాఉండాలంటే..? ఏమి చేయాలి..?

 ఇది కూడా చదవండి..వర్షాకాలంలో నివారించాల్సిన ఆహారాలు, కూరగాయలు

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.