బ్యాడ్ కొలెస్ట్రాల్‌ ను నియంత్రించే కొత్తిమీర..  

షేర్ చేయండి:
బ్యాడ్ కొలెస్ట్రాల్‌ ను నియంత్రించే కొత్తిమీర..  

సాక్షి లైఫ్ : కొత్తిమీరను కూరల్లో వేయడం ద్వారా ఆ కూర రుచి పెరుగుతుంది. కేవలం రుచికి మాత్రమేకాదు.. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలుచేస్తుంది కొత్తిమీర. కొత్తిమీర తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. కొత్తిమీర మూత్ర విసర్జనను పెంచడానికి, మూత్రపిండాల నుంచి విషాన్ని బయటకు పంపడానికి సహాయ పడుతుంది. అంతేకాదు కిడ్నీలో రాళ్లను నివారించడంలోనే కాకుండా మొత్తం మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడడంలో కొత్తిమీర ప్రయోజనకరంగా ఉంటుంది. కొత్తిమీర తీసుకోవడం ద్వారా ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇది కూడా చదవండి..కేరళలో మంకీపాక్స్ వైరస్ క్లాడ్-1 వేరియంట్ మొదటి కేసు నమోదు..

ఇది కూడా చదవండి..ఫస్ట్ యాంటీబయాటిక్ స్మార్ట్ సెంటర్‌.. 

ఇది కూడా చదవండి..ఫర్ హార్ట్ హెల్త్ : జిమ్‌కు వెళ్లినప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి.

ఇది కూడా చదవండి..ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ ఎలా ఉండాలి..?


కొత్తిమీర జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇందులో ఉండే ఫైబర్ ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. తద్వారా కడుపునొప్పి, గ్యాస్ వంటి సమస్యలను నివారిస్తుంది. ఆహారంలో కొత్తిమీర వాడడం వల్ల  జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా, శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది.

బ్యాడ్ కొలెస్ట్రాల్‌ నియంత్రణ.. 

కొత్తిమీర (మంచి కొలెస్ట్రాల్)  హెచ్ డి ఎల్ స్థాయిలను పెంచుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ అంటే ఎల్ డిఎల్ స్థాయిలను తగ్గిస్తుంది. కొత్తిమీరలోని యాంటీఆక్సిడెంట్లు, ఒత్తిడిని తగ్గించడానికి, జీవక్రియను మెరుగుపర చడంలో ఉపయోగపడతాయి. కాబట్టి కొత్తిమీరను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు.

మధుమేహం నుంచి రక్షణ.. 

కొత్తిమీరలో ఎంజైములు, బయోయాక్టివ్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి శరీరంలో ఎంజైమ్ కార్యకలాపాలను సులభతరం చేయడంలో సహాయపడుతాయి. అంతేకాదు రక్తంలో గ్లూకోజ్ ను కూడా నియంత్రిస్తుంది. ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచడానికి, ఎముకలు ఆరోగ్యంగా ఉండటానికి కొత్తిమీర చాలా ఉపయోగపడుతుంది. కొత్తిమీరలో కాల్షియం, ఇతర సమ్మేళనాలు ఉంటాయి. ఎముకల అభివృద్ధికి ఇవి చాలా అవసరం. ఇది బోలు ఎముకల వ్యాధి, ఎముకలు బలహీనపరిచే వ్యాధులను నివారిస్తుంది.

రోగనిరోధక శక్తి.. 

విటమిన్ "సి" , "ఇ" వంటి ముఖ్యమైన పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. కొత్తిమీరలో విటమిన్" సి" పుష్కలంగా ఉంటుంది. ఇది మీ రోగనిరోధక శక్తిని నిరంతరం పెంచడంలో సహాయపడుతుంది. ఈ విటమిన్లతో పాటు, వీటిలో అవసరమైన యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవి శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

ఇది కూడా చదవండి..మహిళల్లో సంతానలేమి సమస్యలకు ప్రధాన కారణాలు..?  

ఇది కూడా చదవండి..రక్తంలో ఆక్సిజన్ తగ్గినప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయి..?

ఇది కూడా చదవండి..ఉదయాన్నే మధుమేహం ఉన్నవారు బ్రేక్ ఫాస్ట్ లో ఎలాంటి ఆహారం తీసుకోవాలి..? 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.