సాక్షి లైఫ్ : మన శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాలలో కిడ్నీ ఒకటి. దాని పనితీరులో ఏదైనా సమస్య వస్తే మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. గతంతో పోలిస్తే కిడ్నీ సంబంధిత వ్యాధులను నయం చేసేందుకు సరికొత్త వైద్య విధానాలు అందుబాటులోకి వచ్చాయి. పలురకాల సాంకేతిక పరిజ్ఞానం మరింతగా పెరిగింది. దీనిద్వారా అనేక రకాల చికిత్సలు చేయవచ్చనేది తెలియజేస్తూ కిడ్నీ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశ్యంతో ప్రతి సంవత్సరం మార్చి నెలలో వరల్డ్ కిడ్నీ డేని జరుపుకుంటారు. కిడ్నీలకు ఏయే విషయాలు ఎక్కువగా హాని కలిగిస్తాయో తెలుసుకుందాం..
ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని..
ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని మార్చి రెండవ గురువారం జరుపుకుంటారు.ఈ ఏడాది మార్చి 14న ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. కిడ్నీ వ్యాధుల పట్ల అవగాహన కల్పించేందుకు ఈ రోజున అనేక కార్యక్రమాలు చేపడుతుంటారు. గుండెలాగే కిడ్నీ కూడా నిరంతరం పని చేస్తుంది. మన శరీరంలోని రక్తాన్ని శుభ్రపరచడానికి , మురికిని తొలగించడానికి కిడ్నీ ఫిల్టర్ లాగా పని చేస్తుంది. కిడ్నీ సంబంధిత సమస్యలు వస్తే ఆ ప్రభావం దాని పనితీరుపై పడుతుంది. శరీరం నుంచి వ్యర్థాలు బయటకు వెళ్లకపోతే అనేక వ్యాధులు వస్తాయి.
ఇది కూడా చదవండి.. మంచూరియా, పీచు మిఠాయిల అమ్మకాలను నిషేధించిన రాష్ట్రం ఏది..?
మధుమేహం..
మధుమేహం కారణంగా అనేక రకాల కిడ్నీ వ్యాధులు వస్తాయి. డయాబెటిక్ రోగుల రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. దీని ప్రభావం మూత్రపిండాలపై పడుతుంది. షుగర్ లెవల్స్ ను నియంత్రించుకుంటే కిడ్నీ సమస్యలు దూరంగా ఉండొచ్చు.
అధిక రక్త పోటు..
మూత్రపిండాల సంబంధిత వ్యాధులకు రెండవ ప్రధాన కారణం అధిక రక్తపోటు. అధిక రక్తపోటు కారణంగా, మూత్రపిండాల నాళాలు దెబ్బతింటాయి. దీని వల్ల వాటి పని సామర్థ్యం తగ్గడం ప్రారంభమవుతుంది. కాబట్టి హై బీపీ ఉన్నవారు బ్లడ్ ప్రెజర్ ను అదుపులో ఉంచుకుంటే కిడ్నీ సమస్యలు తలెత్తకుండా ఉండొచ్చు.
ఎక్కుగా మందులు తీసుకోవడం..
ఎటువంటి కారణం లేకుండా మందులను అధికంగా తీసుకోవడం వల్ల కిడ్నీపై తీవ్ర ప్రభావం పడుతుంది. తద్వారా మూత్రపిండాల పనితీరు అదుపుతప్పుతుంది. దీని కారణంగా కిడ్నీ సంబంధిత అనారోగ్య సమస్యలు పెరుగుతాయి. ఆస్పిరిన్, ఇబుప్రోఫెన్, నాప్రోక్సెన్ వంటి మందులు వైద్యుడిని సంప్రదించకుండా ఎక్కువగా తీసుకున్నప్పుడు లేదా వాటిని క్రమం తప్పకుండా తీసుకున్నప్పుడు మూత్రపిండాలపై చెడు ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ మందులు మూత్రపిండాలకు రక్త ప్రసరణను తగ్గిస్తాయి. మూత్ర ఉత్పత్తిని అడ్డుకోగలవు, అంతేకాదు మూత్రపిండాల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.
మద్యం సేవించడం..
ఆల్కహాల్ ఎక్కువగా తాగడం వల్ల కాలేయంతోపాటు మూత్రపిండాలపైనా ప్రభావం పడుతుంది. ఆల్కహాల్, బీర్ లేదా డ్రగ్స్ తీసుకోవడం వల్ల మూత్రం ఎక్కువసార్లు నడుస్తుంది. దీని వల్ల కిడ్నీ సామర్థ్యం కంటే ఎక్కువ రెట్లు పని చేయాల్సి వస్తుంది. దీని కారణంగా కిడ్నీలు దెబ్బతింటాయి. తక్కువ మోతాదులో ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కిడ్నీ ఆరోగ్యంగా ఉంటుందని కాదు, ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండాలంటే ఆల్కహాల్ పూర్తిగా మానేయడం ఉత్తమం.
కిడ్నీ స్టోన్స్..
మూత్రపిండాల ఆరోగ్యం సరిగా లేకపోతేనే కిడ్నీలో రాళ్లు వస్తాయి. కిడ్నీ స్టోన్స్ వల్ల మూత్రపిండాల పనితీరుకు కొంతమేర ఆటంకం కలుగుతుంది. శరీరంలో కాల్షియం పెరిగినా రాళ్లు ఏర్పడతాయని డాక్టర్లు చెబుతున్నారు. అంతేకాదు డీహైడ్రేషన్ కు గురైనా కిడ్నీలో రాళ్లు వచ్చే అవకాశం ఉంటుందని వారు వెల్లడిస్తున్నారు.
ఇది కూడా చదవండి.. పాప్‌కార్న్ బ్రెయిన్ అంటే..? దీనివల్ల ఏమైనా ఇబ్బందా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com