ప్రతి రోజు నడిచేటప్పుడు అధిక బరువు ఉన్నవాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ప్రతి రోజు 10వేల అడుగులు నడిచేటప్పుడు అధిక బరువు ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. అధిక బరువు ఉన్నవారు నడక ప్రారంభించే ముందు శరీరాన్ని బలపరచే వ్యాయామాలు చేయాలి. నేరుగా 10వేల అడుగులు నడవడం వల్ల జాయింట్‌లపై ఒత్తిడి పెరిగి గాయాలు అయ్యే ప్రమాదం ఉంటుంది.

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..? 

ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

ఇది కూడా చదవండి..మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?  

మోకాలు, నడుము సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి: మోకాలు లేదా నడుము సమస్యలు ఉన్నవారు నడక ప్రారంభించే ముందు వైద్యుని సలహా తీసుకోవాలి.

వాతావరణ పరిస్థితులు: వేడి, తేమ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నడవడం ప్రమాదకరం కావచ్చు. ఈ పరిస్థితుల్లో నడవక పోవడం మానుకోవడం మంచిది.

ప్రారంభంలో తక్కువ అడుగులు: మొదట 2,500 నుంచి 3 వేల అడుగులు నడవడం ప్రారంభించి, నెమ్మదిగా అడుగుల సంఖ్యను పెంచుకోవడం మంచిది.

వివిధ వ్యాయామాలు: నడకతో పాటు శక్తి వ్యాయామాలు, స్ట్రెచింగ్ వంటి ఇతర వ్యాయామాలను కూడా చేయడం అవసరం. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు నడక ప్రారంభించే ముందు వైద్యులను సంప్రదించాలి.

 ప్రతిరోజూ 10వేల అడుగులు నడవడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. అయితే, ప్రతి ఒక్కరి శరీర పరిస్థితి వేరు కావడంతో, వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా వ్యాయామాలు చేయడం ఉత్తమం. ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

 

ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

ఇది కూడా చదవండి.. డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.