Weight Lose : బరువు తగ్గే ప్రయత్నంలో ఉన్నవారు పాప్‌కార్న్ తినొచ్చా..? నిపుణులు ఏమంటున్నారంటే..?
సాక్షి లైఫ్ : బరువు తగ్గాలనుకునే వారికి ఎదురయ్యే అతిపెద్ద సవాలు స్నాక్స్. ఆకలి వేసినప్పుడు ఏవి పడితే అవి తింటే బరువు పెరుగుతారనే భయం వారిని వేధిస్తుంటుంది. ఇలాంటి సమయంలో 'పాప్‌కార్న్' తినొచ్చా లేదా అనే సందేహం చాలా మందికి వస్తుంది. పాప్‌కార్న్ నిజంగానే బరువు తగ్గడానికి సహాయపడుతుందా..? ఇందులో వాస్తవమెంతో ఇప్పుడు తెలుసుకుందాం..
పాప్‌కార్న్ బరువు తగ్గడానికి సాయపడుతుందా..?
పాప్‌కార్న్ అనేది ప్రాథమికంగా ఒక తృణధాన్యం (Whole grain). ఇందులో ఫైబర్ (fiber) అధికంగా ఉంటుంది. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు తినడం వల్ల కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి, పదే పదే ఆకలి వేయదు. ముఖ్యంగా నూనె, వెన్న (Butter) లేకుండా వేయించిన 'ఎయిర్-పాప్డ్' (Air-popped) పాప్‌కార్న్ బరువు తగ్గించే డైట్లో అత్యుత్తమ స్నాక్ ఎంపికగా చెప్పవచ్చు.
అయితే, ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. కేవలం ఏదో ఒక ఆహారం తినడం వల్ల మాత్రమే బరువు తగ్గలేము. రోజంతా మనం తీసుకునే మొత్తం క్యాలరీలు, శారీరక శ్రమ, తగినంత నిద్ర, సమతుల్య ఆహారం వంటివి బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
బరువు తగ్గే క్రమంలో పాప్‌కార్న్ ఎలా తినాలి..?
మీరు డైట్లో ఉన్నప్పుడు పాప్‌కార్న్ తినాలనుకుంటే ఈజాగ్రత్తలు పాటించడం తప్పనిసరిగా పాటించాలి. ఎయిర్ పాప్డ్ విధానం.. నూనె లేకుండా గాలి వేడికి వేయించిన (Air-popped) పాప్‌కార్న్‌కు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వండి. పాప్‌కార్న్‌లో వెన్న, చీజ్, క్యారామెల్ వంటివి అస్సలు కలపకండి. ఉప్పును సాధ్యమైనంత తక్కువ మోతాదులో వాడాలి. పాప్‌కార్న్ ఆరోగ్యకరమైనదే కదా అని అతిగా తినకూడదు. తినే పరిమాణం (Portion size) పై నియంత్రణ ఉండాలి.
ఇది కూడా చదవండి..కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి..మందులతో పని లేకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గేదెలా..?
ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?
లేబుల్స్ గమనించండి..
బయట ప్యాక్ చేసిన పాప్‌కార్న్ కొనేటప్పుడు అందులోని క్యాలరీలు, తయారీకి వాడిన పదార్థాల వివరాలను ప్యాకెట్ పై తప్పక చదవండి.
ఎలాంటి వారు జాగ్రత్త పడాలి..?
మార్కెట్లో దొరికే ఫ్లేవర్డ్ లేదా ప్యాకేజ్డ్ పాప్‌కార్న్‌లో నూనె, వెన్న, పంచదార, చీజ్ వంటివి అధికంగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారు ఇలాంటి వాటిని తింటే క్యాలరీలు పెరిగిపోయి అసలు లక్ష్యం పక్కదారి పడుతుంది.
అలాగే, ఏదైనా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నవారు, లేదా ఉప్పు తక్కువ తినాలని వైద్యులు సూచించినవారు ముఖ్యంగా బీపీ పేషెంట్లు బయట దొరికే పాప్‌కార్న్‌కు దూరంగా ఉండటమే మంచిది. అవసరమైతే డైటీషియన్ సలహా తీసుకోవడం ఉత్తమం.సరైన పద్ధతిలో తయారు చేసుకున్న పాప్‌కార్న్ బరువు తగ్గాలనుకునే వారికి ఒక అద్భుతమైన స్నాక్. కానీ దీన్ని ఏదో మాయ చేసే ఔషధంలా భావించకూడదు. క్యాలరీల సమతుల్యత పాటిస్తూ మితంగా తింటే ఇది మీ డైట్‌కు మంచి జోడింపు అవుతుంది.
ఇది కూడా చదవండి..Researchers Say Lifespan May Be Predictable : మన ఆయుష్షును అంచనా వేయవచ్చంటున్న పరిశోధకులు..
ఇది కూడా చదవండి..Dance to Burn Calories : డ్యాన్స్‌తో క్యాలరీలు బర్న్ : రోజూ 30 నిమిషాల డ్యాన్స్‌తో ఫిట్నెస్ మీ సొంతం..!
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?
ఇది కూడా చదవండి..మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి.. 40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
