కొబ్బరి నీళ్లు ఇలా తాగితే సేఫ్..
సాక్షి లైఫ్ : కొబ్బరి నీళ్లను సురక్షితంగా, ఆరోగ్యకరంగా తాగడానికి కొన్ని చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. లేదంటే..? పలురకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. తాజా నీళ్లు తాగండి : కొబ్బరి బోండాను కొనుగోలు చేసిన వెంటనే అందులోని నీటిని నేరుగా తాగడం ఉత్తమం. అప్పుడే దాని పూర్తి పోషక విలువలను పొందవచ్చు.
ఇది కూడా చదవండి..గుండె జబ్బులు రాకుండా ఉండడానికి వైద్య నిపుణులు చెప్పిన చిట్కాలు..
ఇది కూడా చదవండి..గుండె స్పందన తగ్గినప్పుడు కనిపించే లక్షణాలు..
ఇది కూడా చదవండి..హిమోగ్లోబిన్ పెంచే బెస్ట్ ఫుడ్..?
ఇది కూడా చదవండి..కొత్తిమీర ఆరోగ్యానికి ఒక అద్భుతమైన ఔషధం..
గాజు సీసాలు లేదా స్టెయిన్లెస్ స్టీల్ బాటిల్స్ : ఒకవేళ కొబ్బరి నీళ్లను నిల్వ చేయాలనుకుంటే, గాజు సీసాలు లేదా స్టెయిన్లెస్ స్టీల్ బాటిల్స్ ను ఉపయోగించండి. ఇవి రసాయనాలను విడుదల చేయవు, అంతేకాదు మైక్రోప్లాస్టిక్స్ ప్రమాదం ఉండదు.
నిల్వ : కొబ్బరి నీళ్లను వీలైనంత తక్కువ సమయంలో తాగడం మంచిది. ఎక్కువ సమయం నిల్వ చేయకూడదు. ఫ్రిజ్ లో ఉంచినప్పటికీ, 24 గంటల్లోపు తాగేయడం ఉత్తమం.
సరిగ్గా నిల్వ చేయండి : కొబ్బరి బోండాను బయట ఉంచేటప్పుడు తేమ పట్టకుండా చూసుకోండి. ఒకవేళ తేమ పడితే టవల్ తో తుడిచివేయండి. ఓపెన్ చేసిన కొబ్బరి బోండాన్ని బయట ఉంచడం వల్ల బ్యాక్టీరియా త్వరగా పెరుగుతుంది. కాబట్టి అలా చేయకూడదు.
ఇది కూడా చదవండి..ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకి ఎన్నిగుడ్లు తినాలి..?
ఇది కూడా చదవండి..చలికాలంలో రోగనిరోధక శక్తినిపెంచే మెగ్నీషియం..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
