Cosmetic Dentistry : కెరీర్ కోసం కాస్మెటిక్ డెంటిస్ట్రీ.. యువతలో సరికొత్త ట్రెండ్..! అమెరికన్ అకాడమీ ఆఫ్ కాస్మెటిక్ డెంటిస్ట్రీ సర్వేలో వెల్లడి..  

షేర్ చేయండి:
Cosmetic Dentistry : కెరీర్ కోసం కాస్మెటిక్ డెంటిస్ట్రీ.. యువతలో సరికొత్త ట్రెండ్..! అమెరికన్ అకాడమీ ఆఫ్ కాస్మెటిక్ డెంటిస్ట్రీ సర్వేలో వెల్లడి..  

సాక్షి లైఫ్ : ఇటీవలి కాలంలో మారుతున్న జీవనశైలి, సోషల్ మీడియా ప్రభావం కారణంగా 'పర్ఫెక్ట్ స్మైల్' (perfect smile) సరికొత్త ట్రెండ్‌గా మారింది. ఒకప్పుడు కేవలం సినీ తారలకే పరిమితమైన ఈ 'స్మైల్ మేకోవర్' క్రేజ్.. నేడు సామాన్యుల్లోనూ, ముఖ్యంగా యువతలో విపరీతంగా పెరుగుతోంది. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, సెల్ఫీలు, వీడియో కాల్స్ , డిజిటల్ యుగంలో ముత్యాల లాంటి దంతాలు ఒక స్టేటస్ సింబల్ లా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో కాస్మెటిక్ డెంటిస్ట్రీ మార్కెట్ ప్రపంచవ్యాప్తంగా శరవేగంగా విస్తరిస్తోంది. అందమైన చిరునవ్వు కోసం ప్రజలు లక్షల రూపాయలు ఖర్చు చేసేందుకు వెనుకాడటం లేదు.

 

ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..? 

ఇది కూడా చదవండి..వారానికి రెండుసార్లు తీసుకోవడం ద్వారా అవకాడోతో గుండెపోటుకు చెక్.. !

ఇది కూడా చదవండి..కిడ్నీ వ్యాధి లక్షణాలు: ఈ సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు..

ఇది కూడా చదవండి..ఆహారంలో అవకాడోను ఎలా చేర్చుకుంటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు అంటే..?

 

అసలు 'స్మైల్ మేకోవర్' అంటే ఏమిటి..?

చాలా మంది స్మైల్ మేకోవర్ అంటే కేవలం దంతాలను శుభ్రం చేయడం లేదా తెల్లగా మార్చడం అనుకుంటారు. కానీ, ఇది ఒక సమగ్రమైన కాస్మెటిక్ డెంటిస్ట్రీ ప్రక్రియ. ఇందులో భాగంగా: దంతాల రంగు, ఆకారాన్ని మెరుగుపరుస్తారు. పళ్ల మధ్య ఉండే ఖాళీలను పూరిస్తారు. వంకర పళ్లను సరిచేయడంతో పాటు, చిగుళ్ల ఆకృతిని కూడా సరిదిద్దుతారు.

ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి మహానగరాల్లో అత్యాధునిక 'స్మైల్ డిజైన్ క్లినిక్‌లు' వెలుస్తున్నాయి. ఒకే ఒక్క దంతానికి వెనీర్లు (Veneers) వేయించుకోవడానికి వేల నుంచి లక్షల రూపాయల వరకు ఖర్చవుతోంది. అంతర్జాతీయంగా కొందరు సెలబ్రిటీలు దీని కోసం కోట్లాది రూపాయలు వెచ్చిస్తుండటం విశేషం.

కెరీర్, ఆత్మవిశ్వాసంతో ముడిపడిన చిరునవ్వు..!


అందమైన చిరునవ్వు కేవలం రూపానికే కాదు, వ్యక్తిగత ఆత్మవిశ్వాసానికి, కెరీర్ ఎదుగుదలకు కూడా ఎంతో అవసరమని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.

కెరీర్‌పై ప్రభావం..

 'అమెరికన్ అకాడమీ ఆఫ్ కాస్మెటిక్ డెంటిస్ట్రీ' సర్వే ప్రకారం.. దాదాపు 74% మంది ప్రజలు 'సరిగ్గా లేని చిరునవ్వు' తమ వృత్తిపరమైన పురోగతికి ఆటంకం కలిగిస్తుందని భావిస్తున్నారు.

సోషల్ మీడియా పోలికలు..

 ఫోర్బ్స్ హెల్త్ సర్వే ప్రకారం.. 53% మంది తాము సోషల్ మీడియాలో చూసే ఇతరుల చిరునవ్వులతో తమను పోల్చుకుంటున్నారు. 'జెన్ జి' (యువత) లో ఈ ధోరణి 72% వరకు ఉంటోంది.

ఈ విపరీతమైన డిమాండ్ కారణంగా.. 2025 నాటికి సుమారు రూ.3 లక్షల కోట్లుగా ఉన్న ఈ ప్రపంచ పరిశ్రమ విలువ, రాబోయే పదేళ్లలో రెట్టింపు (రూ.6 లక్షల కోట్లకు పైగా) కానుందని మార్కెట్ విశ్లేషణలు అంచనా వేస్తున్నాయి.

కొత్త టెక్నాలజీలు.. సహజసిద్ధమైన రూపం..

ప్రస్తుతం కృత్రిమంగా కాకుండా, దంతాలు సహజంగా కనిపించేలా చేసే సరికొత్త సాంకేతికతలు అందుబాటులోకి వచ్చాయి:

డిజిటల్ స్మైల్ డిజైన్..

కృత్రిమ మేధ (AI), 3D స్కానింగ్ సాయంతో.. చికిత్స ప్రారంభం కాకముందే తమ చిరునవ్వు ఎలా మారబోతోందో రోగులు స్క్రీన్‌పై ముందే చూసే అవకాశం ఏర్పడింది.

ఇన్విజిబుల్ అలైన్‌ర్లు..

 వంకర పళ్లను సరిచేయడానికి ఇప్పుడు ఇనుప బ్రేసెస్ అవసరం లేదు. బయటకు కనిపించని పారదర్శక అలైన్‌ర్లు అందుబాటులోకి వచ్చాయి.

అల్ట్రా-థిన్ వెనీర్లు..

పంటి ఎనామెల్‌ను దెబ్బతీయకుండా, చాలా తక్కువ అరుగుదలతో అమర్చే 'నో-ప్రెప్ వెనీర్ల'కు ఆదరణ పెరుగుతోంది.

ఆరోగ్యాన్ని పణంగా పెట్టకండి..!

ఈ అందాల అలంకరణ వెనుక ఒక ముప్పు కూడా పొంచి ఉందని దంత వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం ఫొటోల్లో అందంగా కనిపించడం కోసం.. సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్న పళ్లను అరగదీయడం ద్వారా సహజసిద్ధమైన ఎనామెల్ దెబ్బతింటుంది. ఇది దీర్ఘకాలంలో పళ్ల సున్నితత్వం (Sensitivity), ఇన్ఫెక్షన్లు, ఇతర తీవ్రమైన నోటి ఆరోగ్య సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది. కాబట్టి, నిపుణులైన వైద్యుల సలహా మేరకే సరైన నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.

 

ఇది కూడా చదవండి..హెపటైటిస్ " ఏ" నివారించడంలో వ్యాక్సిన్ పాత్ర ఎంత..? 

ఇది కూడా చదవండి..Rainy Season : వర్షాకాలంలో తప్పనిసరిగా తీసుకోవాల్సిన కొన్ని కూరగాయలు

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి.. 

ఇది కూడా చదవండి...బ్యాడ్ ఫుడ్ కాంబినేషన్ : ఎలాంటి ఆహారాలను కలిపి తీసుకోకూడదు

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.