CREA Report : విషతుల్యంగా గాలి.. 447 జిల్లాల పరిస్థితి ఆందోళనకరం..!  

సాక్షి లైఫ్ : వాయు కాలుష్యం (Air Pollution) కేవలం రాజధాని నగరాల సమస్య కాదని, ఇది దేశవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రాంతాలకు విస్తరించిన జాతీయ ఆరోగ్య సంక్షోభమని తాజా నివేదిక స్పష్టం చేసింది. ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ పరిశోధన కేంద్రం (CREA) విడుదల చేసిన ఉపగ్రహ ఆధారిత కాలుష్య అంచనా (Satellite-based Assessment) నివేదికలో అత్యంత ఆందోళనకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 

 

ఇది కూడా చదవండి..వారానికి రెండుసార్లు తీసుకోవడం ద్వారా అవకాడోతో గుండెపోటుకు చెక్.. !

ఇది కూడా చదవండి..హెపటైటిస్ " ఏ" నివారించడంలో వ్యాక్సిన్ పాత్ర ఎంత..? 

ఇది కూడా చదవండి...కిడ్నీ వ్యాధి లక్షణాలు: ఈ సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు..

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి.. 

 

447 జిల్లాల్లో ప్రమాదకర వాతావరణం.. 

దేశంలోని మొత్తం 749 జిల్లాలలో, ఏకంగా 447 జిల్లాల్లో సుమారు 60% గాలి నాణ్యత జాతీయ ప్రమాణాలను (National Ambient Air Quality Standard - 40 g/m^3) మించిపోయిందని నివేదిక తెలిపింది. అత్యంత దారుణంగా, భారతదేశంలో ఏ ఒక్క జిల్లా కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నిర్దేశించిన PM 2.5 ప్రమాణం 5 ను చేరుకోలేకపోయింది. 


ఢిల్లీ అగ్రస్థానం..  

ర్యాంకు (Rank) రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం వార్షిక సగటు PM2.5
PM2.5 (µg/m³)
 
  సాంద్రత
1 ఢిల్లీ (Delhi) 101 
2 చండీగఢ్ (Chandigarh) 70 
3 హర్యానా (Haryana) 63  
4 త్రిపుర (Tripura) 62  
5 అస్సాం (Assam) 60 
6 బీహార్ (Bihar) 59 
7 పశ్చిమ బెంగాల్ (West Bengal) 57
8 పంజాబ్ (Punjab) 56
9 మేఘాలయ (Meghalaya) 53
10 నాగాలాండ్ (Nagaland) 52 

 

ఆరోగ్యానికి పెనుముప్పు.. 

ఈ ప్రమాదకరమైన గాలి నాణ్యత దేశ ప్రజల ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పుగా పరిణమిస్తోందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. PM 2.5 వంటి సూక్ష్మ ధూళి కణాలు ఊపిరితిత్తులలోకి, రక్తంలోకి ప్రవేశించి, ఆస్తమా, బ్రాంకైటిస్, గుండె జబ్బులు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తున్నాయి. వాయు కాలుష్య సమస్యను ఇకపై కేవలం నగరాల సరిహద్దుల్లో చూడకుండా, కాలుష్య కారకాలు రాష్ట్రాల సరిహద్దులను దాటుతున్నందున, ఒక సమగ్రమైన ఎయిర్‌షెడ్ ఆధారిత (Airshed-based) పాలన విధానాన్ని రూపొందించాలని వారు ప్రభుత్వాలకు సిఫార్సు చేస్తున్నారు.

 

ఇది కూడా చదవండి..ఆహారంలో అవకాడోను ఎలా చేర్చుకుంటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు అంటే..?

ఇది కూడా చదవండి..బ్యాడ్ ఫుడ్ కాంబినేషన్ : ఎలాంటి ఆహారాలను కలిపి తీసుకోకూడదు

ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

Tags : air-pollution airpollution pollution-effect prevention delhi-ncr pollution delhi-pollution new-pollution-problem-hotspots hotspots environmental-pollution
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com