Devil Diet for Weight Loss : వెయిట్ లాస్ కోసం డెవిల్ డైట్.. ప్రాణాల మీదకు తెచ్చుకున్న యువతి..!
సాక్షి లైఫ్ : అందంగా కనిపించాలనే ఆరాటం, వేగంగా బరువు తగ్గాలనే తొందర ఆమెను ప్రమాదంలోకి నెట్టాయి. తన ప్రాణ స్నేహితురాలి పెళ్లిలో స్లిమ్‌గా కనిపించాలని చైనాలోని హాంగ్‌జౌకు చెందిన 26 ఏళ్ల జియావోయు (Xiaoyu) అనే యువతి చేసిన 'సాహసం' ఇప్పుడు చర్చనీయాంశమైంది. కేవలం రెండు నెలల్లో 15 కిలోల బరువు తగ్గినప్పటికీ, ఆమె ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతిని 'ప్రీ-డయాబెటిస్' బారిన పడటం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది.
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి..ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హానికరం..?
డెవిల్ వెయిట్-లాస్ ప్లాన్ అంటే..?
జియావోయు తాను స్వయంగా రూపొందించుకున్న ఈ కఠినమైన ఆహార నియమాలను 'డెవిల్ ప్లాన్' అని పేరు పెట్టుకుంది. ఇందులో ఆమె అనుసరించిన మార్గాలు ఏమిటంటే..? కార్బోహైడ్రేట్లు లేకుండా.. అన్నం, రోటీ వంటి ప్రధాన ఆహార పదార్థాలను పూర్తిగా పక్కన పెట్టేసింది. కేవలం అతి తక్కువ పరిమాణంలో కూరగాయలు, ఉడికించిన చికెన్ ముక్కలను మాత్రమే తీసుకునేది. రోజూ 10 కిలోమీటర్లకు పైగా పరుగుతో పాటు, అత్యంత కఠినమైన వర్కౌట్లు చేసేది. దీని ఫలితంగా ఆమె బరువు 65 కిలోల నుంచి 50 కిలోలకు పడిపోయింది. అంటే దాదాపు 15కిలోల బరువు తగ్గింది. అయితే, లక్ష్యాన్ని చేరుకున్న ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు.
అనారోగ్య సమస్యలు..
వేగంగా బరువు తగ్గిన తర్వాత ఆమె శరీరంలో వింత మార్పులు మొదలయ్యాయి. నిరంతరం అలసట, విపరీతమైన ఆకలి, దప్పిక, గుండె దడ, తలతిరగడం వంటి సమస్యలతో ఆమె ఆసుపత్రిలో చేరింది. వైద్యులు పరీక్షించగా షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. ప్రీ-డయాబెటిస్.. ఆమె రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు సాధారణం కంటే ఎక్కువగా ఉండి, మధుమేహం వచ్చే దశకు చేరుకున్నాయి.
కార్బోహైడ్రేట్లు తీసుకోకుండా అతిగా శ్రమించడం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తిలో అస్థిరత ఏర్పడి జీవక్రియ పూర్తిగా దెబ్బతిన్నట్లు వైద్యులు గుర్తించారు. కండరాలు బలహీనపడటంతో పాటు, శరీరంలో నీటి శాతం తగ్గిపోయింది. ఈ ఘటనపై స్పందించిన వైద్య నిపుణులు.. తక్కువ సమయంలో ఎక్కువ బరువు తగ్గాలనుకునే వారికి కీలక సూచనలు చేశారు.
హెల్తీగా బరువు తగ్గడం ఉత్తమం..
ముఖ్యంగా క్రమపద్ధతి లేని డైటింగ్ వల్ల కిడ్నీ సమస్యలు, హార్మోన్ల అసమతుల్యత, గుండె సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. బరువు తగ్గడం అనేది క్రమంగా జరగాలి కానీ ఇలా ప్రాణాల మీదకు తెచ్చుకోకూడదని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. జియావోయు తన తప్పు తెలుసుకుని వైద్యుల సలహాతో మళ్ళీ సమతుల్య ఆహారం తీసుకుంటూ, మితమైన వ్యాయామం ప్రారంభించింది. ఇప్పుడు ఆమె బరువు 52.5 కిలోల వద్ద నిలకడగా ఉండటమే కాకుండా ఆరోగ్యం కూడా మెరుగుపడింది. వేగంగా బరువు తగ్గాలనుకుని కొత్త డైట్ లను ఫాలో అవ్వకుండా హెల్తీగా బరువు తగ్గడం ఉత్తమని గుర్తుంచుకోండి.
ఇది కూడా చదవండి..హార్ట్ ఎటాక్ తర్వాత తొలి 60 నిమిషాలు ఎందుకంత కీలకం..?
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..
ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
