Diabetes Control : మధుమేహం నియంత్రణకు ఆహారం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
సాక్షి లైఫ్ : డయాబెటిస్ నియంత్రణ అనగానే కేవలం మందులపైనే ఆధారపడకుండా, మనం తీసుకునే రోజువారీ ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం ఎంతో అవసరం. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడంతో పాటు బరువు, రక్తపోటు, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సమతులాహారం కీలక పాత్ర పోషిస్తుంది.
డయాబెటిస్‌లో ఆహారం ఎందుకు అంత కీలకం..?
చక్కెర స్థాయిల నియంత్రణ: కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారం తిన్నప్పుడు బ్లడ్ షుగర్ లెవెల్స్ వేగంగా పెరుగుతాయి. కాబట్టి వీటికి బదులుగా తృణధాన్యాలు, పప్పులు, కూరగాయలు ఎంచుకోవడం సురక్షితం.
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి..మందులతో పని లేకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గేదెలా..?
ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?
మిఠాయిలు, శీతల పానీయాలు, ఎక్కువగా ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు చక్కెర స్థాయిలను అమాంతం పెంచుతాయి. వీటి వినియోగాన్ని వీలైనంత మేర తగ్గించాలి. పీచు పదార్థాలు (fiber) మెండుగా ఉండే కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, తృణధాన్యాలు తినడం వల్ల ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలుగుతుంది. దీనివల్ల పదే పదే చిరుతిళ్లు తినాలనే కోరిక తగ్గుతుంది.
ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు..
కేవలం పిండిపదార్థాలు తగ్గించడమే కాకుండా పప్పులు, బీన్స్, గుడ్లు, చేపలు, నట్స్, గింజలు వంటి ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ మీ భోజనంలో ఉండేలా చూసుకోవాలి. ఏం తింటున్నాం అన్నదానితో పాటు ఎంత మోతాదులో, ఏ సమయంలో తింటున్నాం అనేది కూడా ముఖ్యమే. ముఖ్యంగా ఇన్సులిన్ లేదా ఇతర మందులు వాడేవారు సమయానికి భోజనం చేయడం చాలా అవసరం.
మీ ప్లేట్‌లో ఇవి ఉండేలా చూసుకోండి..
భోజనం ప్లేట్‌లో సగానికి పైగా కూరగాయలు, ఆకుకూరలు ఉండేలా చూసుకోండి. తెల్లటి బియ్యం కంటే ముడి బియ్యం, చిరుధాన్యాలు, పప్పుదినుసులకు ప్రాధాన్యం ఇవ్వండి. అదనపు చక్కెరలు ఉండే పానీయాలు, స్వీట్లకు దూరంగా ఉండాలి.
ఒకేసారి కడుపు నిండా తినకుండా, తగిన మోతాదులో కొద్దికొద్దిగా భోజనం చేయాలి. ప్రతిరోజూ శరీరానికి సరిపడా నీళ్లు తాగాలి. ఆహార నియమాలతో పాటు క్రమం తప్పకుండా శారీరక వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. ఆహారంలో ఏవైనా కీలక మార్పులు చేసే ముందు లేదా కొత్త డైట్ ప్రారంభించే ముందు తప్పనిసరిగా మీ వైద్యులను లేదా డైటీషియన్‌ను సంప్రదించి వారి సలహా మేరకే ముందడుగు వేయండి.
ఇది కూడా చదవండి..రోగనిరోధక శక్తి ప్రాధాన్యత తెలుసా..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
