చెర్రీస్ తో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?
సాక్షి లైఫ్ : సాధారణంగా మనం తినే పండు కానప్పటికీ చెర్రీలను అందరూ ఇష్టపడతారు. చెర్రీస్ చూడటానికి చిన్నగా ఉన్నప్పటికీ ఇందులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. పొటాషియం, విటమిన్ " సి" ఫైబర్ కు మంచి మూలం ఈ పండ్లు. వీటిని తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. బ్రిటీష్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, చెర్రీస్ రక్తపోటును నియంత్రించడంలోనూ, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది.
ఇది కూడా చదవండి..ఆహారంలోని పురుగుమందులు దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి..?
ఇది కూడా చదవండి..ప్రోస్టేట్ క్యాన్సర్ ఎలాంటివారికి వస్తుంది..?
ఇది కూడా చదవండి..వృద్ధులలో తుంటి నొప్పికి కారణాలు ఏమిటి..?
చెర్రీ జ్యూస్..
నిద్రలేమితో బాధపడే వారికి చెర్రీ జ్యూస్ ఎంతో మేలు చేస్తుంది. ఇది నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. వ్యాయామం తర్వాత కండరాల నొప్పి, వాపును తగ్గించడంలో కూడా సహాయపడతాయి చెర్రీస్. ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. అంతేకాదు ఇవి మలబద్ధకంతో పోరాడి పేగు ఆరోగ్యాన్ని బలోపేతం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.
చెర్రీస్‌లో ఆంథోసైనిన్స్ అనే సమ్మేళనాలు ఉంటాయి. ఈ సమ్మేళనాలే వాటికి ఎరుపు రంగును ఇస్తాయి. ఇవి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేసి శరీరంలోని వాపులను తగ్గించడంలో సహాయపడతాయి. ఇవి మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. జ్ఞాపకశక్తిని కూడా మెరుగుపరుస్తుంది.
ఇది కూడా చదవండి..తల్లిపాలే శిశువు భవిష్యత్తుకు, ఆరోగ్యపరిరక్షణకు పునాది..
ఇది కూడా చదవండి..ఆహారంలోని పురుగుమందులు దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
