మెంతులతో ఆరోగ్యానికి ఎలాంటి మేలు జరుగుతుంది..?
సాక్షి లైఫ్ : షుగర్ వ్యాధి తోపాటు అనేక అనారోగ్య సమస్యలకు మెంతులు ఔషధంలా పనిచేస్తాయి. తినడానికి కాస్త చేదుగా అనిపించినా మెంతులు వల్ల కలిగే కలిగే ఆరోగ్య ప్రయోజనాల రీత్యా మన ఆహారంలో ఒక భాగంగా చేసుకుంటారు. అందుకే మన పెద్ద వాళ్లు పోపు గింజల్లో మెంతులును ప్రధానంగా చేర్చారు.
వంటింట్లో అందుబాటులో ఉండే సుగంధ ద్రవ్యాల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అటువంటి వాటిలో మెంతులు కూడా ఒకటి. వీటిని తీసుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ముఖ్యంగా మెంతులు సుగంధ ద్రవ్యాలుగానేకాదు. దివ్యౌషధంగా కూడా పనిచేస్తాయి. మహిళలకు మెంతుల వల్ల జరిగే మేలు అంతా ఇంతా కాదు.
ఇది కూడా చదవండి..గురక పెట్టే పిల్లలకు ఎలాంటి చికిత్సలు అవసరం..?
ఇది కూడా చదవండి..కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గించాలంటే ఎలాంటి పానీయాలు మానుకోవాలి..?
ఇది కూడా చదవండి..మెదడు సమస్యలను తగ్గించడంలో ఆక్యుపంక్చర్ పాత్ర..?
ఇది కూడా చదవండి..కొవ్వు కాలేయ సమస్య తలెత్తకుండా ఉండాలంటే ఏమేమి తినాలి..?
పౌడర్లు, క్యాప్సూల్స్ , నూనెలతో సహా వివిధ రూపాల్లో లభిస్తున్న ఈ మెంతులు పురుషులు, స్త్రీలలో ఇతర వైద్య పరిస్థితులకు కూడా సహాయపడతాయని నమ్ముతారు. మెంతులను వివిధ రూపాల్లో తీసుకోవడం ద్వారా వివిధ రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. మరి మెంతులలో దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలను గురించి తెలుసుకుందాం..
రక్తంలో చక్కెర స్థాయిలు..
మెంతులు రక్తంలో చక్కెర స్థాయిలను క్రమబద్దీకరించడంలో బాగా పనిచేస్తాయి. అదేవిధంగా అజీర్తి, కడుపుబ్బరాన్ని కూడా తగ్గిస్తాయి. కాబట్టి మధుమేహం ఉన్నవాళ్లు నిత్యం మెంతులు తీసుకోవడం అలవాటుగా చేసుకోవాలని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. మెంతుల్లో ఉండే ఫైబర్ కడుపు నిండిన భావన కలిగిస్తుంది. తద్వారా ఆకలి కూడా తగ్గుతుంది. ఆ సమయంలో ఒంట్లో కొవ్వు కరుగుతుంది.
జీర్ణ శక్తి..
రాత్రిపూట ఒక చెంచా మెంతి గింజలను నీళ్లలో నానబెట్టి ఉదయం లేవగానే పరగడుపున ఆ నీళ్లను తాగడంవల్ల అజీర్తి సమస్య తగ్గుతుంది. జీర్ణ శక్తి మెరుగు పడుతుంది. అదేవిధంగా విరేచనాలు తగ్గడానికి కూడా మెంతులు ఉపయోగపడుతాయి. మెంతులను వేయించి మెత్తగా పొడిలా చేసుకుని , రోజూ ఉదయాన్నే ఆ పొడిని వేడి నీటిలో కలుపుకుని తాగితే ఎన్నో అనారోగ్య సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.
ఇది కూడా చదవండి..క్రానిక్ సైనసిటిస్ కు అక్యూట్ సైనసిటిస్ తేడా ఏంటి..?
ఇది కూడా చదవండి..నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?
ఇది కూడా చదవండి..జన్యుపరమైన సమస్యలను ఏవిధంగా అధిగమించాలంటే..?
గమనిక : ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
