ప్లాస్టిక్ కాలుష్యం వల్ల శరీరంలోని అవయవాలకు కలిగే హాని ఏంటో తెలుసా..?  

షేర్ చేయండి:
ప్లాస్టిక్ కాలుష్యం వల్ల శరీరంలోని అవయవాలకు కలిగే హాని ఏంటో తెలుసా..?  

సాక్షి లైఫ్ : ప్లాస్టిక్ వినియోగం మన జీవితంలో ఒక భాగమైపోయింది. ఇది ఆరోగ్యానికి, పర్యావరణానికి రెండింటికీ హానికరం. ప్లాస్టిక్ కాలుష్యం వాతావరణంలో వ్యర్థాలను పేరుకుపోయేలా చేస్తుంది, ఇవి మైక్రోప్లాస్టిక్‌లుగా మారి మన ఆహారం, నీటిలో ప్రవేశిస్తాయి. దీనివల్ల మీకు అనేక అనారోగ్య సమస్యలు తలెత్తాయి.

 

ఇది కూడా చదవండి..వారానికి రెండుసార్లు తీసుకోవడం ద్వారా అవకాడోతో గుండెపోటుకు చెక్.. !

ఇది కూడా చదవండి..హెపటైటిస్ " ఏ" నివారించడంలో వ్యాక్సిన్ పాత్ర ఎంత..? 

ఇది కూడా చదవండి..కిడ్నీ వ్యాధి లక్షణాలు: ఈ సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు..

ఇది కూడా చదవండి...వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి.. 

 

 శ్వాసకోశ సమస్యలు..  

ప్లాస్టిక్‌ను కాల్చినప్పుడు వెలువడే పొగ నుంచి విషపూరిత వాయువులు (డైఆక్సిన్, ఫ్యూరాన్) విడుదలవుతాయి. మనం శ్వాస పీల్చినప్పుడు ఈ విష వాయువులు మన శరీరంలోకి చేరతాయి. ఇది ఊపిరితిత్తులకు తీవ్ర నష్టం కలిగిస్తుంది. దీనివల్ల ఆస్తమా, బ్రోన్కైటిస్ వంటి వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది.

 మెదడుపై ప్రభావం..  

ప్లాస్టిక్‌లోని రసాయనాలు మెదడు అభివృద్ధిపై చెడు ప్రభావాన్ని చూపుతాయి. ముఖ్యంగా పిల్లలు, గర్భంలో ఉన్న శిశువులపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇది జ్ఞాపకశక్తి బలహీనపడటానికి దారితీస్తుంది.

  రోగనిరోధక శక్తి బలహీనపడటం..  

ప్లాస్టిక్ నుంచి వెలువడే విష పదార్థాలు రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తాయి. దీనివల్ల ఇన్ఫెక్షన్ల ప్రమాదం పెరుగుతుంది. ఫలితంగా మీరు తరచుగా అనారోగ్యానికి గురవుతుంటారు.

 కాలేయం, కిడ్నీలపై  తీవ్రప్రభావం..  

శరీరం నుంచి విష పదార్థాలను తొలగించే పని కాలేయం, కిడ్నీలు చేస్తాయి. అయితే, ప్లాస్టిక్‌తో నిరంతర వినియోగం వల్ల పలు  అవయవాలపై కూడా తీవ్ర ప్రభావం పడుతుంది.
 

ఇది కూడా చదవండి..ఆహారంలో అవకాడోను ఎలా చేర్చుకుంటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు అంటే..?

ఇది కూడా చదవండి..బ్యాడ్ ఫుడ్ కాంబినేషన్ : ఎలాంటి ఆహారాలను కలిపి తీసుకోకూడదు

ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.