Green Potatoes : ఆలుగడ్డలు ఆకుపచ్చగా ఎందుకు మారుతాయో మీకు తెలుసా..?
సాక్షి లైఫ్ : బంగాళదుంపలు (Potatoes) మన వంటగదుల్లో నిత్యం ఉండే కూరగాయ. అయితే, వీటిని సరిగ్గా నిల్వ చేయకపోతే అవి విషతుల్యంగా మారే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆలుగడ్డలపై సూర్యరశ్మి లేదా వెలుతురు పడినప్పుడు వాటిలో క్లోరోఫిల్ ఉత్పత్తి అయ్యి ఆకుపచ్చగా మారుతాయి.ఈ క్రమంలో గ్లైకోఆల్కలాయిడ్స్ (solanine) అనే సహజ రసాయనాల స్థాయి అధికంగా పెరుగుతుంది. ఇది ఆరోగ్యానికి హానికరం. ఆకుపచ్చగా మారిన, మొలకలు వచ్చిన, వండినప్పుడు చేదుగా అనిపించే బంగాళదుంపలను తినకపోవడమే సురక్షితం.
ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?
ఇది కూడా చదవండి..మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఆలుగడ్డలు ఆకుపచ్చగా ఎందుకు మారుతాయి..?
ఆలుగడ్డలపై సూర్యరశ్మి లేదా వెలుతురు పడినప్పుడు వాటిలో క్లోరోఫిల్ ఉత్పత్తి అయ్యి ఆకుపచ్చగా మారుతాయి.ఈ క్రమంలో గ్లైకోఆల్కలాయిడ్స్ (solanine) అనే సహజ రసాయనాల స్థాయి అధికంగా పెరుగుతుంది. ఇది ఆరోగ్యానికి హానికరం. ఆకుపచ్చగా మారిన, మొలకలు వచ్చిన, వండినప్పుడు చేదుగా అనిపించే బంగాళదుంపలను తినకపోవడమే సురక్షితం.
మొలకలు వచ్చినవి వాడొచ్చా..?
ఆలుగడ్డలు గట్టిగా ఉండి, చిన్న మొలకలు మాత్రమే వస్తే ఆ భాగాన్ని కత్తిరించి మిగతా దుంపను వాడుకోవచ్చు. కానీ ఎక్కువగా మొలకలు వచ్చి, ముడతలు పడి, ఆకుపచ్చ రంగులోకి మారిన దుంపలను వంటలకు వాడకుండా పడేయడమే మంచిది.
సొలనిన్ పెరిగితే వచ్చే అనర్థాలు..
ఈ విషతుల్యమైన ఆలుగడ్డలను తింటే వికారం, వాంతులు, కడుపునొప్పి, విరేచనాలు, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి.
పరిస్థితి తీవ్రమైతే నాడీ వ్యవస్థపై కూడా దుష్ప్రభావం పడే ప్రమాదం ఉంది.
వండితే విషం పోతుందా..?
ఆకుపచ్చగా మారిన, పాడైన ఆలుగడ్డలను ఉడకబెట్టడం, నూనెలో వేయించడం లేదా బేక్ చేయడం వల్ల అందులోని గ్లైకోఆల్కలాయిడ్స్ పూర్తిగా నశించవు. ఉష్ణోగ్రతలకు ఈ విషపదార్థం పూర్తిగా నశించదు.
ఎలా నిల్వ చేయాలి..?
ఆలుగడ్డలను ఎల్లప్పుడూ చల్లగా, పొడిగా ఉండే చీకటి ప్రదేశంలో గాలి ఆడేలా నిల్వ చేయాలి. నేరుగా సూర్యరశ్మి తగిలే చోట లేదా ఎక్కువ వెలుతురు పడే చోట ఉంచకూడదు. మార్కెట్లో కొనేటప్పుడే గట్టిగా ఉండేవి, ఆకుపచ్చ రంగు లేనివి ఎంచుకోవాలి.
అనుమానాస్పదంగా ఉన్న ఆలుగడ్డలు తిన్న తర్వాత వాంతులు, కడుపునొప్పి, తలతిరగడం లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి. ముఖ్యంగా పిల్లల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి.
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి.. డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?
ఇది కూడా చదవండి..మందులతో పని లేకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గేదెలా..?
ఇది కూడా చదవండి..Jamun Benifits : జీర్ణ సమస్యలకు సరైన దివ్యౌషధం నేరేడు పండు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
