సాక్షి లైఫ్ : బాల్యంలో ఒబేసిటీ వున్నవారు పెద్దయిన తర్వాత సన్నబడే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. యవ్వనంలోకి ప్రవేశించిన తర్వాత కూడా భారీకాయం నిలిచివుంటే గుండె జబ్బులు, డయాబెటిస్, పక్షవాతం, ఎముకల బలహీనత లాంటివి వస్తాయి. భారీకాయంవలన అనేక ఇతర వ్యాధులు వచ్చే ప్రమాదం వుంటుందంటున్నారు పరిశోధకులు.
ఇది కూడా చదవండి..ఈ 5 సప్లిమెంట్స్ కు డబ్బు దండగ అంటున్న వైద్యనిపుణులు..!
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
గర్భాశయ సమస్యలు..
రొమ్ము కాన్సర్, గర్భాశయ సమస్యలు తలెత్తుతాయి. థైరాయిడ్ గ్రంథిలో మార్పులు, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, జీర్ణనాళ క్యాన్సర్, అండాశయ సమస్యలు వస్తాయి. భారీకాయపు బాల్యం మానసిక సమస్యల్ని తెస్తుంది. చిన్నతనంలో భారీగా కనిపించేవారిని తోటివారంతా వింతగా చూస్తూ రకరకాల మాటలతో అవహేళన చేస్తుంటారు. స్కూలు స్థాయిలో స్నేహం చేసేందుకు ముందుకురారు.
చురుగ్గా ఉండలేదన్న కారణంగా ఆటల్లో కలుపుకోరు. దీనివలన ఒంటరిననే భావం ఏర్పడుతుంది. తమ రూపం మీద తమకే అసహ్యం వేస్తుంటుంది. మానసిక ఆందోళన పెంచుకుంటారు. ఆలోచనలు శరీరంమీద వున్నందున చదువులో వెనకబడతారు. ఇటువంటి వారిని తోటివారు ఏడిపిస్తుంటారు. డిప్రెషన్‌కు గురై అధికంగా తిండి తింటారు. ఇలా ఒకదానిపై ప్రభావం మరొకదానిపై ఉంటుంది. భారీకాయం వంశపారంపర్య లక్షణాలు కూడా. కుటుంబ చరిత్ర, ఆహారపు అలవాట్లు వంటివి పరీక్షించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పగలుగుతారు.
తలిదండ్రులు పిల్లల ఆహారపు అలవాట్లు మీద ప్రత్యేక దృష్టి పెట్టాల్సి వుంటుంది. ఆరోగ్యానిచ్చే పోషక పదార్థాలకు ప్రాధాన్యత పెంచి, క్యాలరీలు అధికంగా ఇచ్చేవాటిని తగ్గించుకోవాలి. ఏవో కొన్ని ఆహార పదార్థాల్ని ఇష్టంగా తీసుకుని మిగిలినవాటిని కాదనకూడదు. బియ్యం, గోధుమలు మన ముఖ్య ఆహారం. దీంతోపాటు పప్పుదినుసులు అవసరం. పాలు, పండ్లు, తాజా కూరగాయలు, ఆకుకూరలు, అన్నం సమపాళ్ళలో తీసుకోవాలి.
అతిగా తినటంవల్ల శరీరం దెబ్బతింటుంది. జీర్ణక్రియ సామర్థ్యం తగ్గుతుంది. తిన్నది సరిగా ఒంటపట్టదు. ఫలితంగా క్యాలరీలు పేరుకుంటాయి. క్రమంగా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుంటుంది. అది మొదలైతే తగ్గడం చాలా కష్టం. కాబట్టి ట్రిమ్‌గా ఎదిగేలా పిల్లల్ని పెంచండి. ఆరోగ్యవంతమైన సంతానాన్ని సమాజానికి అందించాలి.
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?
ఇది కూడా చదవండి.. ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి మంచిది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com