Aerobic Exercise : వృద్ధాప్య ఛాయలతగ్గించి, జ్ఞాపకశక్తిని పెంచే ఏరోబిక్స్‌.. తాజా పరిశోధనలో వెల్లడి..

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : వయసుపై బడుతున్న కొద్దీ చర్మంపై ముడతలు రావడం సహజం.. కానీ మెదడు కూడా ముడత పడి, చురుకుదనం తగ్గుతుందని మీకు తెలుసా..? అయితే, క్రమం తప్పకుండా చేసే ఒక ప్రత్యేక వ్యాయామం మెదడును వృద్ధాప్య ఛాయల నుంచి కాపాడటమే కాకుండా, దానిని యవ్వనంగా ఉంచుతుందని తాజా పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా 40 ఏళ్లు దాటిన వారిలో జ్ఞాపకశక్తిని పదును పెట్టడానికి 'ఏరోబిక్ వ్యాయామాలు' (Aerobic Exercises) అద్భుతంగా పనిచేస్తాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.

 

ఇది కూడా చదవండి.. ఎసిడిటీని అంతమొందించే ఇంటి చిట్కాలు.. 

ఇది కూడా చదవండి..Tamarind : మైక్రోప్లాస్టిక్స్‌ ముప్పును తొలగించే అస్త్రం.. 'చింతపండు'.. తాజా పరిశోధనలో వెల్లడి..

ఇది కూడా చదవండి..Shock for Tattoo Lovers..! టాటూస్ తో 29శాతం స్కిన్ క్యాన్సర్ ముప్పు..

 

 చురుకుదనం.. 

అడ్వెంట్ హెల్త్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ నిర్వహించిన ఈ అధ్యయనంలో ఆసక్తికరమైన అంశాలు వెలుగుచూశాయి. ఏడాది పాటు నిలకడగా వ్యాయామం చేసిన వ్యక్తుల మెదడు, శారీరక శ్రమ చేయని వారితో పోలిస్తే సుమారు ఒక సంవత్సరం చిన్నదిగా మారినట్లు పరిశోధకులు గుర్తించారు.

అకాల మెదడు వృద్ధాప్యాన్ని అడ్డుకోవడానికి 'మధ్య వయస్సు' అత్యంత కీలకమైన సమయమని, ఈ దశలో తీసుకునే జాగ్రత్తలు దశాబ్దాల పాటు మెదడు పనితీరుపై సానుకూల ప్రభావం చూపుతాయని వివరించారు.

జ్ఞాపకశక్తికి 'వరం'.. 

మెదడును సంరక్షించుకోవడం అనేది ఒక రోజులో జరిగేది కాదు. దీర్ఘకాలికంగా చేసే ఏరోబిక్ వ్యాయామాల వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి.

నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఒత్తిడి తగ్గి మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.

ఏరోబిక్స్‌తో మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు..

సాధారణంగా ఈ వ్యాయామాలు కేవలం మెదడుకే కాదు, శరీరమంతటికీ మేలు చేస్తాయి.

ఊపిరితిత్తులు, గుండె, కండరాలు దృఢంగా మారుతాయి.

శరీర బరువు అదుపులో ఉంటుంది.

పక్షవాతం (స్ట్రోక్), మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధుల ముప్పు తప్పుతుంది.

సులభమైన మార్గాలివే..

ఈ ప్రయోజనాలు పొందడానికి జిమ్‌కు వెళ్లి కష్టపడాల్సిన అవసరం లేదు. మన దైనందిన జీవితంలో పలు రకాల పనులను భాగం చేసుకుంటే సరిపోతుంది. చురుకైన నడక (Brisk Walking), పరుగు లేదా జాగింగ్, ఈత కొట్టడం (Swimming), సైక్లింగ్, నృత్యం (Dancing).. 

 మెదడు వృద్ధాప్యంలో వచ్చే చిన్న మార్పులు కూడా భవిష్యత్తులో పెద్ద ప్రభావం చూపుతాయి. అందుకే నేటి నుంచే శారీరక శ్రమను అలవాటు చేసుకోవడం మేలని పరిశోధకులు సూచిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..? 

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.