Men Over 40 : 40ఏళ్లు దాటిన పురుషుల శరీరంలో కనిపించే ఈ సంకేతాలను అశ్రద్ధ చేయకండి..

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : పురుషులు తరచుగా తమ ఆరోగ్య సమస్యలను కేవలం పని ఒత్తిడి, అలసట లేదా వయసు ప్రభావంగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు. ముఖ్యంగా 40 ఏళ్లు దాటిన వారు శరీరంలో కనిపించే కొన్ని కీలక మార్పులను ఏమాత్రం తేలికగా తీసుకోకుండా వెంటనే వైద్యులను సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలి.

ఇది కూడా చదవండి..ఆహారంలో అవకాడోను ఎలా చేర్చుకుంటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు అంటే..?

ఇది కూడా చదవండి..హెపటైటిస్ " ఏ" నివారించడంలో వ్యాక్సిన్ పాత్ర ఎంత..? 

ఇది కూడా చదవండి..కిడ్నీ వ్యాధి లక్షణాలు: ఈ సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు..

 

నిరంతర అలసట, నీరసం..

తగినంత నిద్ర, విశ్రాంతి తీసుకున్నప్పటికీ తరచుగా అలసటగా లేదా నిస్సత్తువగా అనిపిస్తుంటే అది రక్తహీనత, థైరాయిడ్, పోషకాల లోపం లేదా ఇతర అంతర్గత సమస్యలకు సంకేతం కావచ్చు.

ఛాతీలో నొప్పి లేదా బరువుగా అనిపించడం..

ఛాతీలో నొప్పి, బిగుతుగా లేదా బరువుగా అనిపించడాన్ని ఎప్పుడూ విస్మరించకూడదు. దీనితో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చల్లటి చెమటలు పట్టడం, ఈ నొప్పి భుజాలు లేదా దవడ వరకు వ్యాపిస్తుంటే వెంటనే అత్యవసర వైద్య సహాయం తీసుకోవాలి.

శ్వాస ఆడకపోవడం..

రోజువారీ పనులు చేస్తున్నప్పుడు, మెట్లు ఎక్కుతున్నప్పుడు లేదా కొద్దిదూరం నడవగానే తీవ్రంగా ఆయాసం వస్తుంటే దానిని గుండె లేదా ఊపిరితిత్తుల సమస్యగా అనుమానించాలి.

అకస్మాత్తుగా బరువు తగ్గడం..

ఎలాంటి డైట్, వ్యాయామాలు చేయకుండానే అకారణంగా బరువు వేగంగా తగ్గుతుంటే అది సాధారణం కాదు. దీనికి తోడు ఆకలి లేకపోవడం, నీరసం ఉంటే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలి.

మూత్రవిసర్జనలో మార్పులు..

తరచుగా మూత్రం రావడం, విసర్జన సమయంలో మంట, మూత్రంలో రక్తం పడటం లేదా మూత్రవిసర్జన ప్రారంభించడంలో కష్టంగా అనిపించడం వంటివి ప్రోస్టేట్, కిడ్నీ లేదా మూత్రాశయ సమస్యలకు సూచికలు.

చర్మం, శరీరంలో కొత్త మార్పులు..

శరీరంలో ఉన్న పుట్టుమచ్చల రంగు లేదా పరిమాణంలో మార్పులు రావడం, దీర్ఘకాలంగా మానని గాయాలు లేదా ఎక్కడైనా కొత్తగా గడ్డలు ఏర్పడితే అశ్రద్ధ చేయకూడదు.

దీర్ఘకాలిక జీర్ణ సమస్యలు..

అజీర్తి, కడుపునొప్పి, దీర్ఘకాలిక మలబద్ధకం లేదా విరేచనాలు, మలంలో రక్తం పడటం వంటి లక్షణాలు తరచుగా కనిపిస్తుంటే వెంటనే గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ను సంప్రదించాలి.

గురక, పగటిపూట నిద్రమత్తు..

నిద్రలో తీవ్రమైన గురక, శ్వాస ఆగినట్లు అనిపించడం, రాత్రి నిద్రపోయినా పగటిపూట విపరీతమైన నిద్రమత్తుగా ఉండటం 'స్లీప్ ఆప్నియా' (Sleep Apnea) లక్షణాలు కావచ్చు. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే తీవ్రమైన జబ్బుగా భావించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ ఇవి దీర్ఘకాలం పాటు కొనసాగుతూ రోజువారీ పనులకు ఆటంకం కలిగిస్తుంటే మాత్రం కచ్చితంగా నిపుణులైన వైద్యులను సంప్రదించి పూర్తిస్థాయి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.

 

ఇది కూడా చదవండి..Don’t Ignore Fever : సాధారణ జ్వరమే కదా అని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు..! ఈ 5 లక్షణాలపై అవగాహన అవసరం.. 

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

 ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?


గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.