ఊపిరితిత్తుల క్యాన్సర్‌పై లాన్సెట్ తాజా అధ్యయనం..

సాక్షి లైఫ్ : లాన్సెట్ చేసిన కొత్త అధ్యయనం చేసింది. ధూమపానం చేయని వారిలో కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు వేగంగా పెరుగుతున్నాయని, దీనికి వాయు కాలుష్యమే ప్రధాన కారణమని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ అధ్యయనాన్ని ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ అండ్  వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రీసెర్చర్స్ సంయుక్తంగా చేశారు.

 

ఇది కూడా చదవండి..బ్యాడ్ ఫుడ్ కాంబినేషన్ : ఎలాంటి ఆహారాలను కలిపి తీసుకోకూడదు

ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..? 

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి.. 

 

పరిశోధనలో భాగంగా శాస్త్రవేత్తలు 2022 నుంచి ప్రపంచ క్యాన్సర్ డేటాను విశ్లేషించారు. ఇది "అడెనోకార్సినోమా" అని పిలిచే ఒక రకమైన ఊపిరితిత్తుల క్యాన్సర్ సాధారణంగా ధూమపానం చేయని వ్యక్తులలో వస్తోందని వెల్లడైంది. 2022లో ప్రపంచవ్యాప్తంగా నమోదైన అన్ని ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసుల్లో 53–70శాతం ఎప్పుడూ ధూమపానం చేయని వ్యక్తులలో ఉన్నాయని కూడా ఈ అధ్యయనం కనుగొంది.

కాలుష్యం క్యాన్సర్ కు కారణమవుతోంది..

వాయు కాలుష్యం, ముఖ్యంగా PM2.5 వంటి కణాలు ప్రపంచవ్యాప్తంగా ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసుల పెరుగుదలకు కారణమవుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ కణాలు ఊపిరితిత్తుల లోపలికి చేరి కణాలను దెబ్బతీస్తాయి. క్యాన్సర్ వచ్చే అవకాశాలను పెంచుతాయి. 2022లో మహిళల్లో 80,378 ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు వాయు కాలుష్యంతో ముడిపడి ఉన్నాయని పరిశోధకులు నిరూపించారు.

ఎలాంటి వ్యక్తులు ఎక్కువ ప్రమాదంలో ఉన్నారు..?

ఈ అధ్యయనం ప్రకారం.. ఊపిరితిత్తుల క్యాన్సర్ కారణంగా సంభవించే మొత్తం మరణాలలో ధూమపానం చేయని వారు ఐదవ స్థానంలో ఉన్నారు. ఈ సమస్య మహిళలు, ఆసియా దేశాలలో వేగంగా పెరుగుతోంది. ఫ్రెడ్డీ బ్రే అనే శాస్త్రవేత్త ప్రకారం, ఈ రోజుల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు పెరగడానికి రెండు కారణాలు ఉన్నాయి..ప్రజల ధూమపాన అలవాట్లు మారాయి. రెండవది వాయు కాలుష్యం పెరిగింది.

 

ఇది కూడా చదవండి..కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?  

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : air-pollution airpollution research pollution-effect lungs pollution who who-report world-health-organization world-health-organization-statistics genital-organs smoking-causes-eye-issues smoking delhi-pollution new-pollution-problem-hotspots pollution-in-delhi pollution-less-cities smoking-and-copd air-pollution-caused-due-to-smoking-of-cigarettes air-pollution-due-to-smoking-of-cigarettes non-smokers the-lancet
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com