Fatty liver : ఫ్యాటీ లివర్ ను ఆరోగ్యకర జీవనశైలితో రివర్స్ చేయవచ్చా..? 

షేర్ చేయండి:
Fatty liver : ఫ్యాటీ లివర్ ను ఆరోగ్యకర జీవనశైలితో రివర్స్ చేయవచ్చా..? 

సాక్షి లైఫ్ : కొవ్వు కాలేయం (ఫ్యాటీ లివర్) ను రివర్స్ చేయవచ్చని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలి, సమతుల ఆహారపు అలవాట్ల ద్వారా ఈ సమస్యను నియంత్రించవచ్చని వారు చెబుతున్నారు. ఫ్యాటీ లివర్ వ్యాధి పట్ల అవగాహన పెంచడం ద్వారా  సరైన సమయంలో తగిన చర్యలు తీసుకోవడం ద్వారా ఆయా వ్యాధి నుంచి బయటపడొచ్చని డాక్టర్లు అంటున్నారు.  

ఇది కూడా చదవండి..ఫర్ క్వాలిటీ స్లీప్ : ఎలాంటి మార్పుల ద్వారా నాణ్యమైన నిద్ర పొందవచ్చు..?

ఇది కూడా చదవండి..స్లీప్ మాక్సింగ్ ట్రెండ్ ఆరోగ్యానికి ప్రమాదకరమా..?

ఇది కూడా చదవండి..ప్రోటీన్ లోపంవల్ల తలెత్తే 6 అనారోగ్య సమస్యలు..?

 

ఎక్కువగా అధిక బరువు, మధుమేహం, మద్యపానం, ,అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్ల ఫ్యాటీ లివర్ వ్యాధి సంభవిస్తుంది. రోజువారీ వ్యాయామం, పోషకాహారం, మద్యం వినియోగాన్ని తగ్గించడం ద్వారా కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఈ వ్యాధిని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడం సాధ్యమవుతుందని వైద్యనిపుణులు చెబుతున్నారు.

ప్రజలు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని, ముఖ్యంగా కాలేయ సంబంధిత సమస్యలను ముందుగానే గుర్తించేందుకు లివర్ ఫంక్షన్ టెస్టులు చేయించుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. అలాగే, పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు వంటి పోషకాహారాన్ని ఆహారంలో చేర్చుకోవాలని, జంక్ ఫుడ్, అధిక కొవ్వు ఉన్న ఆహారాలను తగ్గించాలని వారు సలహా ఇస్తున్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం ద్వారా కొవ్వు కాలేయంతో పాటు ఇతర దీర్ఘకాలిక వ్యాధులను కూడా నివారించవచ్చు అని డాక్టర్లు వెల్లడిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి..పచ్చకామెర్లు ప్రాణాలకు ప్రమాదమా..?

ఇది కూడా చదవండి..కిడ్నీడ్యామేజ్ అయ్యే ముందు కనిపించే 5 లక్షణాలు.. 

ఇది కూడా చదవండి..కాలేయంలోని వ్యర్థాలను ఎలా తొలగించాలి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.