వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండేందుకు ఈ చిట్కాలు పాటించండి..
సాక్షి లైఫ్ : వర్షాకాలంలో అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అలాంటి వ్యాధులకు దూరంగా ఉండాలంటే పలురకాల జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకోసం ఏమేం చేయాలి..? ఏమేం చేయకూడదు..? ఇప్పటికే పరిశుభ్రంగా లేకపోవడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా అనేక అంటువ్యాధులు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. కాబట్టి అలాంటివి రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..వృద్ధులలో తుంటి నొప్పికి కారణాలు ఏమిటి..?
ఇది కూడా చదవండి..తల్లిపాలే శిశువు భవిష్యత్తుకు, ఆరోగ్యపరిరక్షణకు పునాది..
ఇది కూడా చదవండి..ఆహారంలోని పురుగుమందులు దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి..?
చుట్టూ శుభ్రత పాటించండి..
ఇంటి చుట్టూ శుభ్రత పాటించండి. ఇంట్లో ఎక్కడా నీరు పేరుకుపోకుండా, దోమల నివారణకు చర్యలు తీసుకోవాలి. చేతులను తరచుగా సబ్బుతో కడగాలి, ముఖ్యంగా తినడానికి ముందు తప్పనిసరిగా . శ్వాసక్రియకు అనుకూలమైన దుస్తులను ధరించండి. చేతిగోళ్లను చిన్నగా, శుభ్రంగా ఉంచాలి.
సమతుల్య ఆహారం..
మంచి ఆరోగ్యం, రోగనిరోధక శక్తి కోసం పోషకాలు అధికంగా ఉండే ఆహారం తీసుకోండి. స్ట్రీట్ ఫుడ్, జంక్ ఫుడ్ , ప్రాసెస్ చేసిన ఆహారాలు మంచి రుచిని కలిగి ఉంటాయి. కానీ అవి ఆరోగ్యానికి ఎటువంటి ప్రయోజనాన్ని అందించవు. వీటికి బదులు తాజాగా ఇంట్లో వండిన ఆహారాన్ని తినండి. తగినంత నీరు తాగాలి. నీళ్లు మరిగించి తాగితే మరింత మంచిది. విటమిన్ "సి" అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఇది ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది.
స్పైసీ ఫుడ్..
వర్షాలు పడే సమయంలో స్పైసీ ఫుడ్ తినాలనుకుంటారు. కానీ వర్షం కారణంగా వర్కవుట్ చేయలేరు. దీని వల్ల శరీరం అధిక బరువు సమస్య తలెత్తవచ్చు. తద్వారా స్థూలకాయ సమస్య మరింతగా పెరుగుతుంది. జిమ్‌కి వెళ్లి వ్యాయామం చేయడం సాధ్యం కాకపోతే, ఇంట్లో యోగా లేదా కార్డియో చేయండి. దీంతో శరీరం ఫిట్‌గా ఉండడమే కాకుండా రోగ నిరోధక శక్తి కూడా బలంగా ఉంటుంది.
టీకాలు..
ఇన్ఫ్లుఎంజా వంటి వ్యాధుల నుంచి సురక్షితంగా ఉండటానికి టీకాలు తీసుకోవడం ఒక ప్రభావవంతమైన మార్గం. వర్షాకాలం ప్రారంభమయ్యేలోపు ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా ఆయా వ్యాధుల నుంచి సురక్షితంగా ఉండొచ్చు.
ఇది కూడా చదవండి..ఆహారంలోని పురుగుమందులు దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి..?
ఇది కూడా చదవండి..ప్రోస్టేట్ క్యాన్సర్ ఎలాంటివారికి వస్తుంది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
