Global fatty liver day- 2025 : కాలేయ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే 4 ఆహారాలు..
సాక్షి లైఫ్ : కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి పలురకాల ఆహారాలకు దూరంగా ఉండటం, సమతుల్య ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వంటి ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించాలి. ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ కాలేయ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే 4 రకాల ఆహారాలను గురించి వివరించారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..ఈ 4 ఆహారాలను దూరం పెడితే కాలేయానికి ఎలాంటి సమస్య రాదు..
ఇది కూడా చదవండి..గుండె స్పందన తగ్గినప్పుడు కనిపించే లక్షణాలు..
ఇది కూడా చదవండి..కాలేయం దెబ్బతింటుందని సూచించే సంకేతాలు ఇవే..
ప్రాసెస్ చేసిన మాంసం..
బేకన్, సాసేజ్, హాట్ డాగ్స్ వంటి ప్రాసెస్ చేసిన మాంసానికి దూరంగా ఉండాలి. ఈ ఆహారాలలో సాధారణంగా నైట్రేట్లు, ప్రిజర్వేటివ్‌లు అధికంగా ఉంటాయి. ఇవి కాలేయాన్ని నెమ్మదిగా దెబ్బతీసి, కాలేయ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి.
మద్యం..
మద్యం ఆరోగ్యానికి అన్ని విధాలుగా హానికరం. దీనిలో సురక్షితమైనది ఏదీ లేదు. డాక్టర్ సేథి కూడా ఈ విషయంలో హెచ్చరిస్తూ, కాలేయ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించుకోవాలనుకుంటే, మద్యానికి దూరంగా ఉండటం చాలా ముఖ్యమని అన్నారు. కొందరు సురక్షితమని భావించే రెడ్ వైన్ కూడా ఇందులో భాగమే. కాబట్టి, మద్యం సేవించడం తగ్గించడం లేదా పూర్తిగా మానేయడం కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అత్యంత కీలకమైన చర్యలలో ప్రధానమైంది.
చక్కెర పానీయాలు..
కాలేయ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించుకోవాలంటే చక్కెర పానీయాలకు వీడ్కోలు చెప్పాల్సిందే. సోడా, ఎనర్జీ డ్రింక్స్, ఇతర చక్కెర పానీయాలలో ఉండే ఫ్రక్టోజ్ కాలేయంపై ఒత్తిడిని కలిగించి, ఫ్యాటీ లివర్ ప్రమాదాన్ని పెంచుతుందని వైద్యనిపుణులు అంటున్నారు.
వేయించిన ఆహారాలు..
ఫ్రెంచ్ ఫ్రైస్, చిప్స్, వేయించిన చికెన్ వంటి డీప్ ఫ్రైడ్ ఆహారాలను నివారించడం ఉత్తమమని డాక్టర్ చెబుతున్నారు. ఈ ఆహారాలను తరచుగా తీసుకోవడం వల్ల కాలేయంలో దీర్ఘకాలిక ఇన్ఫ్లమేషన్ ఏర్పడుతుంది. ఇది కాలక్రమేణా కాలేయ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది.
ఇది కూడా చదవండి..హెపటైటిస్ ఏ సమస్య వర్షాకాలంలోనే పెరగడానికి కారణాలు..?
ఇది కూడా చదవండి..పేస్‌మేకర్ హార్ట్ పేషెంట్లకు ఎప్పుడు అవసరం..?
ఇది కూడా చదవండి..గుండె జబ్బులు రాకుండా ఉండడానికి వైద్య నిపుణులు చెప్పిన చిట్కాలు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
