Green peas : పచ్చి బఠానీ ఆరోగ్య ప్రయోజనాలు..?

సాక్షి లైఫ్ : 100 గ్రాముల పచ్చి బఠానీలలో 0.282 mg విటమిన్ B1 ఉంటుంది. ఇవి  కాకుండా  కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, సోడియం, సెలీనియం వంటి ముఖ్యమైన ఖనిజాలు కూడా ఉన్నాయి. పచ్చి బఠానీలను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా థయామిన్ (విటమిన్ B1) పొందవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

ఇది కూడా చదవండి..కాలేయం, కిడ్నీ సమస్యలున్నప్పుడు కనిపించే 5 కీలక సంకేతాలు ఇవే..

ఇది కూడా చదవండి..హైపోథైరాయిడిజాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి ఏమేం చేయాలి..?

ఇది కూడా చదవండి..బంగాళదుంపలకు బరువు పెరుగడానికి ఏంటి లింక్..?

 

పచ్చి బఠానీలలో పిండి పదార్థాలు, ప్రొటీన్లు,ఫైబర్, విటమిన్ "ఏ",   విటమిన్ "కె", వంటి అనేక ప్రయోజనకరమైన పోషకాలతోపాటు యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. గుండె జబ్బులు,క్యాన్సర్ వంటి కొన్ని దీర్ఘకాలిక వ్యాధుల నుంచి  రక్షించడంలో సహాయపడతాయని పలు పరిశోధనల్లో వెల్లడైంది. 

విటమిన్ B1.. దీనినే థయామిన్ అని కూడా అంటారు. ఇది నీటిలో కరిగే విటమిన్. ఇది శరీరం కార్బోహైడ్రేట్‌లను శక్తిగా ఉపయోగించడానికి సహాయపడుతుంది. విటమిన్ B1 లోపిస్తే బెరిబెరి వ్యాధి వస్తుంది. అంతేకాదు నరాల సంబంధిత రుగ్మతలు కూడా  తలెత్తుతాయి. పచ్చి బఠానీలో విటమిన్ B1 పుష్కలంగా లభిస్తుంది. 

థయామిన్ సహజంగా మాంసం, చేపలు, తృణధాన్యాలలో లభిస్తుంది. థయామిన్ (విటమిన్ B1) పొందడానికి మీ ఆహారంలో చేపలు, బీన్స్, పప్పులు,పెరుగును కూడా భాగం చేసుకోవచ్చు. 

ఇది కూడా చదవండి..దీర్ఘకాలిక ఇన్ఫ్లమేషన్ కు ప్రధాన కారణాలు ఏమిటి..?

ఇది కూడా చదవండి..క్రాష్ డైట్ తో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

Tags : green-peas protein-food protein high-fiber fiber fiber-food high-protein-foods essential-minerals chickpea-flour vitamins-and-minerals
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com