థయామిన్ లోపంతో ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి..?
సాక్షి లైఫ్ : నరాలు, కండరాలు, గుండె ఆరోగ్యంగా ఉంచడంలో విటమిన్ బి-1 ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. విటమిన్ B1ని థయామిన్ అని కూడా అంటారు. మన శరీరంలో గ్లూకోజ్ జీవక్రియకు, నరాలు, కండరాల పనితీరును సులభతరం చేయడానికి ఇది చాలా అవసరం. శరీరంలో దీని లోపం అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యలను పెంచుతుంది. విటమిన్ B-1 ఎందుకు ముఖ్యమైనదో ,దాని లోపం వల్ల ఏయే సమస్యలు వస్తాయో తెలుసుకుందాం..?
ఇది కూడా చదవండి.. 40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..?
ఇది కూడా చదవండి.. పిల్లల స్క్రీన్ టైమ్ గురించి భారతీయ తల్లుల ఆందోళన
ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?
ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?
ఆహారంలో పోషకాలు సమృద్ధిగా తీసుకుంటే..ఆయా ఆహారం అనేక రకాల తీవ్రమైన వ్యాధుల నుంచి సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. అందుకే ఆకు కూరలు, సీజనల్ పండ్లను ప్రతిరోజూ తినాలని ఆరోగ్య నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. సాధారణంగా పోషకాహారం విషయానికి వస్తే, విటమిన్ "సి", "డి"తో పాటు ప్రోటీన్ వంటివి ప్రతి ఒక్కరికీ అవసరం. అయితే విటమిన్ "బి1" కూడా మన శరీరానికి ఇతర పోషకాల వలె చాలా ముఖ్యమైనది.
థయామిన్..
విటమిన్ B1 లేదా థయామిన్ అనేది నీటిలో కరిగే విటమిన్, ఇది శరీరం కార్బోహైడ్రేట్‌లను శక్తిగా ఉపయోగించడానికి సహాయపడుతుంది. విటమిన్ B1 లోపం సాధారణంగా బెరిబెరి వ్యాధికి కారణమవుతుంది. అంతేకాదు నరాల సంబంధిత రుగ్మతలు కూడా పెంచుతుంది.
ఇది కాకుండా, విటమిన్ B1లోపిస్తే బరువు తగ్గడం, అనోరెక్సియా సమస్య తలెత్తుతుంది. తీవ్రమైన సందర్భాల్లో గందరగోళం, జ్ఞాపకశక్తి సమస్యలు కూడా సంభవించవచ్చని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.
ఆహారంలో కొన్ని అంశాలను చేర్చుకోవడం ద్వారా విటమిన్ బి1ను పొందవచ్చు. అటువంటి వాటిలో సన్ ఫ్లవర్ సీడ్స్ చాలా ముఖ్యమైనవి. పొద్దుతిరుగుడు గింజల్లో విటమిన్ బి1 తగినంత మొత్తంలో ఉంటుంది. 100 గ్రాముల పొద్దుతిరుగుడు విత్తనాలలో 0.106 mg విటమిన్ B1 పొందవచ్చు.
పొద్దుతిరుగుడు విత్తనాలలో విటమిన్లు B2, B3, B6, C, E అండ్ K వంటి అనేక ఇతర ముఖ్యమైన పోషకాలు కూడా ఉన్నాయి. సన్ ఫ్లవర్ సీడ్స్ అనేక తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో ఉపయోగకరంగా ఉంటాయి. విటమిన్ B-1 అవసరాలను రోజువారీ ఆహారంలో చేర్చడం ద్వారా తీర్చవచ్చు.
పచ్చి బఠానీలో..
100 గ్రాముల పచ్చి బఠానీలలో 0.282 mg విటమిన్ B1 ఉంటుంది. ఇవి కాకుండా కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, సోడియం, సెలీనియం వంటి ముఖ్యమైన ఖనిజాలు కూడా ఉన్నాయి. పచ్చి బఠానీలను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా థయామిన్ (విటమిన్ B1) పుష్కలంగా లభిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
థయామిన్ సహజంగా మాంసం, చేపలు, తృణధాన్యాలలో లభిస్తుంది. థయామిన్ (విటమిన్ B1) పొందడానికి మీ ఆహారంలో చేపలు, బీన్స్, పప్పులు , పెరుగును కూడా భాగం చేసుకోవచ్చు.
యునైటెడ్ స్టేట్స్‌లో 19 అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారికి విటమిన్ B1ను 1.2 మిల్లీగ్రాములు (mg) మహిళలకు 1.1 mg రోజువారీ తీసుకోవాలని సిఫార్సు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి.. డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?
ఇది కూడా చదవండి.. క్రానిక్ సైనసిటిస్ కు అక్యూట్ సైనసిటిస్ తేడా ఏంటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
