Heart Attack : పురుషులతో పోలిస్తే మహిళల్లో గుండెపోటు లక్షణాలు ఎలా భిన్నంగా ఉంటాయి..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : గుండెపోటు అనేది కేవలం పురుషులకు మాత్రమే వచ్చే సమస్య కాదు, మహిళల్లోనూ ఈ ముప్పు ఉంటుంది, అయితే వారిలో కనిపించే ప్రాథమిక లక్షణాలు చాలా భిన్నంగా ఉంటాయి. తరచుగా ఈ ముందస్తు సంకేతాలను మహిళలు సాధారణ అలసట, గ్యాస్, ఎసిడిటీ లేదా ఒత్తిడిగా పొరబడి నిర్లక్ష్యం చేస్తుంటారు.

ఛాతీలో అసౌకర్యం.. 

పురుషుల్లా ఎడమవైపు తీవ్రమైన నొప్పి రాకపోవచ్చు. ఛాతీపై ఏదో బరువు పెట్టినట్లు, బిగుతుగా లేదా ఒత్తిడిగా అనిపిస్తుంది. ఈ నొప్పి స్వల్పంగా ఉన్నప్పటికీ ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు.

 

ఇది కూడా చదవండి..రోగనిరోధక శక్తి ప్రాధాన్యత తెలుసా..?

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి.. 

 

విపరీతమైన అలసట.. 

ఎలాంటి శారీరక శ్రమ చేయకపోయినా అకారణంగా, అకస్మాత్తుగా విపరీతమైన నీరసం ముంచుకొస్తుంది. ఇది సాధారణంగా వచ్చే అలసట కంటే చాలా భిన్నంగా ఉంటుంది.

శ్వాస ఆడకపోవడం.. 

ఎలాంటి స్పష్టమైన కారణం లేకుండానే శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది కలుగుతుంది. సరిపడా గాలి అందనట్లుగా ఆయాసం వస్తుంటే అది గుండెపోటుకు ముందస్తు సంకేతం కావచ్చు.

వికారం, కడుపు నొప్పి.. గుండెపోటు వస్తున్న సమయంలో కొందరిలో వాంతులు, వికారం, కడుపు పైభాగంలో తీవ్రమైన అసౌకర్యం కలుగుతాయి. దీన్ని చాలామంది అజీర్తి లేదా గ్యాస్ ట్రబుల్ సమస్యగా భావించి తేలికగా తీసుకుంటారు. శరీర భాగాలకు నొప్పి విస్తరించడం.. నొప్పి కేవలం ఛాతీ భాగానికే పరిమితం కాకుండా వీపు, భుజాలు, మెడ, చేతులు లేదా దవడ కింద వరకు వ్యాపిస్తుంది.

చల్లటి చెమటలు, తలతిరగడం..

అకస్మాత్తుగా తలతిరగడం, తీవ్రమైన బలహీనత ఆవహించడం, శరీరమంతా చల్లటి చెమటలు పట్టడం వంటివి ఇతర లక్షణాలతో కలిపి వస్తే వెంటనే అప్రమత్తం కావాలి. అకస్మాత్తుగా ఛాతీలో ఒత్తిడి, ఊపిరి ఆడకపోవడం, స్పృహ కోల్పోవడం, శరీరంలోని ఇతర భాగాలకు నొప్పి పాకడం లాంటివి జరిగితే ఏమాత్రం ఆలస్యం చేయకూడదు. పైన పేర్కొన్న ప్రతి లక్షణం గుండెపోటు కాకపోవచ్చు, కానీ అనుమానం వచ్చినప్పుడు సొంత అంచనాలకు రాకుండా తక్షణమే అత్యవసర వైద్య సహాయం (Medical Emergency) తీసుకోవడం ద్వారా ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చు.

ఇది కూడా చదవండి...బ్యాడ్ ఫుడ్ కాంబినేషన్ : ఎలాంటి ఆహారాలను కలిపి తీసుకోకూడదు

ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..? 

ఇది కూడా చదవండి..వారానికి రెండుసార్లు తీసుకోవడం ద్వారా అవకాడోతో గుండెపోటుకు చెక్.. !

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.