హ్యూమన్ మెటానిమో వైరస్ ను ఎదుర్కోవడానికి రోగనిరోధక శక్తి ఎలా పెంచుకోవాలి..?
సాక్షి లైఫ్ : హ్యూమన్ మెటానిమోవైరస్(హెచ్‌ఎంపీవీ) వ్యాప్తి చెందుతోంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమ రోగనిరోధక శక్తిని పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా హెచ్‌ఎంపీవీ వైరస్ ను ఎదుర్కోవాలంటే తప్పనిసరిగా రోగనిరోధక శక్తిని పెంచుకోవాలని వైద్యనిపుణులు చెబుతున్నారు. డెంగ్యూ జ్వరం, ర్యాట్ ఫీవర్ వంటి వ్యాధులు సోకినట్లయితే, అది శరీరంలోని రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది.
అంతేకాదు వ్యాధి ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. అందువల్ల, రోగనిరోధక శక్తిని పెంచే ముఖ్యమైన పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారాన్ని తినడం చాలా అవసరం. రోగనిరోధక శక్తి అనేది వివిధ వ్యాధులను నివారించడానికి సహాయపడుతుంది. అల్పాహారంలో హెల్తీ ఫుడ్స్‌ని చేర్చుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడంతోపాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
ఇది కూడా చదవండి..ఆర్థరైటిస్ చికిత్సలో స్టెమ్ సెల్ థెరపీని ఉపయోగించడంలో ఎలాంటి సవాళ్లు ఉన్నాయి?..
ఇది కూడా చదవండి..మీ కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి 7 మార్గాలు
ఇది కూడా చదవండి..అల్లోపతి, యునాని చికిత్సా విధానాల మధ్య ముఖ్యమైన తేడాలు ఏమిటి?
గుడ్డు..
రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. గుడ్లలో విటమిన్ డి, జింక్, సెలీనియం, విటమిన్ "ఇ" వంటి పోషకాలు కూడా ఉన్నాయి. ఇవి శరీరానికి సరైన రోగనిరోధక పనితీరుకు అవసరం. అల్పాహారంలో ప్రతి రోజు ఉడికించిన గుడ్లు లేదా ఆమ్లెట్ తీసుకోవచ్చు.
చిలగడదుంప..
చిలగడదుంప శరీర శక్తిని పెంచుతుంది. ఆరోగ్యకరమైన శరీరానికి అవసరమైన కాల్షియం, మెగ్నీషియం, థయామిన్, జింక్, విటమిన్లు ,మినరల్స్ వంటి పోషకాలు వీటిలో ఉంటాయి. వీటిలో పీచుపదార్థాలు ఎక్కువగానూ, కొవ్వు పదార్థాలు తక్కువగానూ ఉండటం వల్ల బరువు కూడా అదుపులో ఉంటుంది.
ఓట్స్..
ఓట్ మీల్ ఆరోగ్యకరమైన అల్పాహారం. ఓట్స్‌లో యాంటీఆక్సిడెంట్లు, ప్రొటీన్లు, ఫైబర్, మినరల్స్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఓట్స్‌లో ఫైబర్, బీటా-గ్లూకాన్ కూడా ఉంటాయి.
ఇది కూడా చదవండి..కిడ్నీలో రాళ్లు ఎలా ఏర్పడతాయి..? వాటికి కారణమేమిటి..?
ఇది కూడా చదవండి..విటమిన్స్ అన్నిటిని పొందాలంటే..? ఏమిచేయాలి..?
ఇది కూడా చదవండి..నెఫ్రోలిథియాసిస్ అంటే ఏమిటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
