విటమిన్-డి లోపం వల్ల మెదడుపై ఎలాంటి ప్రభావం పడుతుంది..?  

సాక్షి లైఫ్ : డిమెన్షియా ,అల్జీమర్స్ ప్రమాదం: విటమిన్-డి లోపం వల్ల మెదడులో 'అమిలాయిడ్ (అబెటా లేదా బీటా-అమిలాయిడ్)' అనే పెప్టైడ్స్ పేరుకుపోతాయి. ఇవి జ్ఞాపకశక్తిని దెబ్బతీసి, అల్జీమర్స్ వ్యాధికి దారితీస్తాయి. డిప్రెషన్, మూడ్ స్వింగ్స్: విటమిన్-డి సెరోటోనిన్, డోపమైన్ వంటి న్యూరోట్రాన్స్‌మిటర్లను నియంత్రిస్తుంది. దీని లోపం వల్ల డిప్రెషన్, ఆందోళన వంటివి పెరుగుతాయి.

 ఇది కూడా చదవండి..చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించే పనస పండు.. 

 ఇది కూడా చదవండి.. ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి మంచిది..?

 ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

ఆటిజం, ఇతర సమస్యలు: గర్భధారణ సమయంలో విటమిన్-డి లోపం శిశువు మెదడు అభివృద్ధిపై ప్రభావం చూపుతుంది. ఇది ఆటిజం వంటి నరాల సంబంధిత సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది.

మైగ్రేన్, తలనొప్పి: విటమిన్-డి లోపం వల్ల న్యూరోఇన్‌ఫ్లమేషన్ పెరిగి మైగ్రేన్, నిరంతర తలనొప్పి సమస్యలు రావచ్చు.

విటమిన్-డి లోపం లక్షణాలు.. 

అలసట,బలహీనత

జ్ఞాపకశక్తి తగ్గడం

డిప్రెషన్, చిరాకు

నిద్రలేమి

కండరాల నొప్పులు

తరచుగా ఇన్ఫెక్షన్లు రావడం

ఇది కూడా చదవండి.. లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి.. గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..?

 ఇది కూడా చదవండి.. డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : brain-health brain-stroke vitamin-d-deficiency vitamin-deficiency vitamin-d-deficiency-causes vitamin-d-deficiency-treatment vitamin-d-deficiency-signs vitamin-d-deficiency-and-depression vitamin-d-benefits vitamins-and-minerals
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com