బర్డ్ ఫ్లూ రాకుండా ఉండాలంటే చికెన్ ను ఎంతసేపు ఉడికించాలి..?  

సాక్షి లైఫ్ : బర్డ్ ఫ్లూ ప్రధానంగా పక్షుల ద్వారా వ్యాపిస్తుంది. మన ఆరోగ్యాన్ని రక్షించుకోవాలంటే, ముఖ్యంగా చికెన్ వంటి మాంసాహారాన్ని తినే ముందు సరిగ్గా ఉడికించడం చాలా అవసరమని వైద్యనిపుణులు చెబుతున్నారు. సరైన ఉష్ణోగ్రత వద్ద చికెన్‌ను వండడం ద్వారా ఈ వైరస్‌ను పూర్తిగా నిర్మూలించవచ్చు.

 

ఇది కూడా చదవండి..ఫర్ క్వాలిటీ స్లీప్ : ఎలాంటి మార్పుల ద్వారా నాణ్యమైన నిద్ర పొందవచ్చు..?

ఇది కూడా చదవండి..స్లీప్ మాక్సింగ్ ట్రెండ్ ఆరోగ్యానికి ప్రమాదకరమా..?

ఇది కూడా చదవండి..ప్రోటీన్ లోపంవల్ల తలెత్తే 6 అనారోగ్య సమస్యలు..?

 

 బర్డ్ ఫ్లూ వైరస్ శరీరంలోకి ప్రవేశించినప్పటి నుంచి లక్షణాలు కనిపించడానికి మధ్య సమయం మూడు నుంచి నాలుగు రోజులు పడుతుందని అంటున్నారు. పచ్చిమాంసం కానీ, సరిగా ఉడకించకుండా అస్సలు తినకూడదని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. కోళ్ల పారమ్స్ వద్ద పరిశుభ్రంగా ఉంచాలని, ముఖ్యంగా అందులో పనిచేసే కార్మికులు బర్డ్ ఫ్లూ సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పశుసంవర్ధక శాఖ అధికారులు సూచిస్తున్నారు. 


బర్డ్ ఫ్లూ వైరస్ పలుచోట్ల వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కోడి మాంసం, గుడ్లను బాగా ఉడికించిన తర్వాతే తినాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. అయితే ఎన్ని డిగ్రీల వద్ద ఉడికించడం వల్ల బర్డ్ ఫ్లూ వైరస్ సోకే ప్రమాదం ఉంటుంది..? బర్డ్ ఫ్లూ వైరస్ (H5N1) 60 నుంచి 70 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద మనుగడ సాగించలేదని వెటర్నరీ అధికారులు చెబుతున్నారు. చికెన్ తినడం ద్వారా మరింత వ్యాప్తి చెందే అవకాశాన్ని ఆరోగ్య అధికారులు తోసిపుచ్చారు.

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి..పచ్చకామెర్లు ప్రాణాలకు ప్రమాదమా..?

ఇది కూడా చదవండి..కిడ్నీడ్యామేజ్ అయ్యే ముందు కనిపించే 5 లక్షణాలు.. 

ఇది కూడా చదవండి..కాలేయంలోని వ్యర్థాలను ఎలా తొలగించాలి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : bird-flu bird-flu-symtoms bird-flu-case birds avian-influenza bird-flu-symptoms bird-flu-virus bird-flu-death bird-flu-in-humans bird-flu-effect-on-humans bird-flu-news bird-flu-symptoms-in-birds bird-flu-effect-on-human-brain bird-mortality-due-to-air-pollution what-is-bird-flu bird-flu-outbreak h5n1-virus bird-flu-alert bird-flu-risk
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com