Cancer : బ్లడ్ క్యాన్సర్ ను ప్రారంభ దశలో ఎలా గుర్తించాలి..?

షేర్ చేయండి:
Cancer : బ్లడ్ క్యాన్సర్ ను ప్రారంభ దశలో ఎలా గుర్తించాలి..?

సాక్షి లైఫ్: బ్లడ్ క్యాన్సర్ (హేమటోలాజికల్ క్యాన్సర్) చాలా ప్రమాదకరమైన వ్యాధి. ఇది ప్రాణాంతకమైనప్పటికీ, ప్రారంభ దశలో సరైన లక్షణాలను గుర్తించి చికిత్స ప్రారంభిస్తే ప్రాణాలు కాపాడవచ్చు. ఈ వ్యాధిని ముందుగానే గుర్తించేందుకు కొన్ని సంకేతాలు ఉన్నాయి. అవి ఏమిటి..? అనేవి ఇప్పుడు తెలుసుకుందాం.. 

 

ఇది కూడా చదవండి..స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచే జన్యుపరమైన అంశాలు ఏమిటి..? 

ఇది కూడా చదవండి..ఊపిరితిత్తుల క్యాన్సర్‌పై లాన్సెట్ తాజా అధ్యయనం..

 

అలసట లేదా తరచుగా అంటువ్యాధులు.. 

బ్లడ్ క్యాన్సర్ ఉన్న వ్యక్తుల్లో మామూలు వ్యక్తుల కంటే ఎక్కువ అలసటగా నిపించవచ్చు. అలాగే, వారు తరచుగా ఇన్ఫెక్షన్ల బారిన పడవచ్చు. క్యాన్సర్ ఆరోగ్యకరమైన రక్త కణాల ఉత్పత్తిని అడ్డుకోవడం వల్ల రక్తహీనత ఏర్పడుతుంది. దీనివల్ల రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది, ఇది బ్లడ్ క్యాన్సర్ సంకేతంగా భావించవచ్చు.

అకస్మాత్తుగా బరువు తగ్గడం.. 

 బరువు తగ్గడం అనేది బ్లడ్ క్యాన్సర్, అలాగే ఇతర రకాల క్యాన్సర్ల ప్రారంభ లక్షణాలు కావచ్చు. శరీరం వ్యాధితో పోరాడటానికి శక్తిని ఖర్చు చేసే సందర్భంలో ఇలా బరువు తగ్గడం జరుగుతుంది.

ఎముకలలో నొప్పి,రక్తస్రావం.. 

ప్లేట్‌లెట్ కౌంట్ తగ్గడం వల్ల చిన్న గాయాలు అయినా ఎక్కువసేపు రక్తస్రావం కావచ్చు. బ్లడ్ క్యాన్సర్ ఎముక మజ్జను ప్రభావితం చేస్తుంది.  ఇది ఎముకల్లో తీవ్రమైన నొప్పి లేదా పగుళ్లకు కారణం కావచ్చు.

జ్వరం,రాత్రిపూట చెమటలు.. 

ఏ కారణం లేకుండా జ్వరం రావడం, అలాగే రాత్రిపూట చెమటలు పట్టడం అనేది బ్లడ్ క్యాన్సర్ సూచన కావచ్చు. ఈ లక్షణాలు కనిపిస్తే   వెంటనే వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది.

ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..? 

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.