White Hair : తెల్ల జుట్టు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి..?
సాక్షి లైఫ్ : ఒకప్పుడు వృద్ధాప్యానికి సంకేతంగా భావించే తెల్లజుట్టు, నేడు పట్టుమని పాతికేళ్లు నిండని యువతలోసైతం కనిపిస్తోంది. ఆధునిక కాలంలో మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు జుట్టు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. శరీరంలోని మెలనిన్ ఉత్పత్తి తగ్గడం వల్ల జుట్టు తన సహజ రంగును కోల్పోయి బూడిద లేదా తెలుపు రంగులోకి మారుతుంది. అయితే కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా ఈ సమస్యను అరికట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి.. రసాయనాలతో పండిన పుచ్చకాయను ఎలా కనుక్కోవచ్చు..
ఇది కూడా చదవండి.. షుగర్ ఉన్నవాళ్లు పైనాపిల్ తినకూడదా..?
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
తెల్ల జుట్టుకు ప్రధాన కారణాలు..?
అధిక ఒత్తిడి.. నేటి వేగవంతమైన జీవితంలో పని ఒత్తిడి, ఆందోళన జుట్టు రంగును దెబ్బతీస్తున్నాయి. ఒత్తిడి వల్ల శరీరంలో విడుదలయ్యే రసాయనాలు జుట్టు మూలాలపై ప్రభావం చూపుతాయి. ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల జుట్టుకు అందాల్సిన విటమిన్లు, ప్రోటీన్లు అందడం లేదు. ముఖ్యంగా విటమిన్ బి-12 లోపం అకాల నెరపుకు దారితీస్తుంది. సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల శరీరంలో 'ఆక్సీకరణ ఒత్తిడి' పెరుగుతుంది. ఇది జుట్టు నెరవడానికి ఒక ప్రధాన కారణం.పెరిగిన పర్యావరణ కాలుష్యం, ధూమపానం వల్ల జుట్టులోని సహజ నూనెలు నశించి, రంగు మారిపోతుంది. జన్యుపరమైన సమస్యలు.. కుటుంబంలో తల్లిదండ్రులకు చిన్న వయసులోనే తెల్లజుట్టు వస్తే, పిల్లలకు కూడా వచ్చే అవకాశం ఉంది.
నివారణ మార్గాలు ఏమిటి మరి..?
పోషకాహారం..పండ్లు, ఆకుకూరలు, తృణధాన్యాలు, ప్రోటీన్లు సమృద్ధిగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. ఇవి జుట్టుకు కావాల్సిన పోషణను అందిస్తాయి.రోజూ యోగా, ధ్యానం లేదా నచ్చిన వ్యాయామం చేయడం ద్వారా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. శరీరక వ్యవస్థలన్నీ సక్రమంగా పనిచేయాలంటే రోజుకు కనీసం 7 నుంచి 8 గంటల నిద్ర అవసరం. కెమికల్స్ ఎక్కువగా ఉండే షాంపూలకు దూరంగా ఉండాలి. సల్ఫేట్ లేని షాంపూలను ఎంచుకోవాలి.
బయటకు వెళ్ళినప్పుడు జుట్టు కాలుష్యానికి గురికాకుండా కవర్ చేసుకోవాలి. అకస్మాత్తుగా జుట్టు తెల్లబడటం ప్రారంభిస్తే, అది శరీరంలో ఏదైనా అంతర్గత లోపానికి సంకేతం కావచ్చు. అటువంటప్పుడు సొంత వైద్యం కంటే నిపుణులైన డెర్మటాలజిస్ట్‌లను సంప్రదించడం బెటర్.
ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి.. ఎసిడిటీని అంతమొందించే ఇంటి చిట్కాలు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
