జికా వైరస్ సింటమ్స్ ఎలా ఉంటాయి..?
సాక్షి లైఫ్ : జికా వైరస్ లక్షణాలు ఎలా ఉంటాయి..? ఎలాంటి లక్షణాలను బట్టి జికా వైరస్ ఉందని నిర్ధారించవచ్చు..? అనేదాని గురించి పరిశోధకులు పలు ఆసక్తికర అంశాలు వెల్లడించారు. దీనిపై అధ్యయనం చేసిన తర్వాత జికా వైరస్ కు సంబంధించి ఎటువంటి లక్షణాలు లేవని, ఇది డెంగ్యూ జ్వరాన్ని పోలి ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జికా వైరస్ అనేది దోమల ద్వారా సంక్రమించే వ్యాధి. ఇది ఏడిస్ దోమల ద్వారా వ్యాపిస్తుందని వారు వెల్లడించారు. ఈ దోమ డెంగ్యూ, చికున్‌గున్యా, ఎల్లో ఫీవర్‌ని కూడా వ్యాపింపజేస్తుంది.
ఇది కూడా చదవండి.. ఆయుష్షు రహస్యాలను గురించి చెప్పిన 111ఏళ్ల వృద్ధుడు..
ఇది కూడా చదవండి.. WHO Report : ఈ వ్యాధి ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణమవుతోంది..
సింటమ్స్ విషయంలో..
ఇది సాధారణంగా పగటిపూట కుడుతుంది. పెద్దలలో తక్కువ తీవ్రత కలిగిన వ్యాధిగా పరిగణిస్తారు. దీని సాధారణ లక్షణాలు తేలికపాటి జ్వరం, దద్దుర్లు, తలనొప్పి, కండరాలు, కీళ్ల నొప్పి , కనురెప్పల కింద వాపు. ఈ లక్షణాలు సాధారణంగా 2 నుంచి 7 రోజుల వరకూ ఉంటాయి.
సుమారు 80 శాతం కేసులలో, లక్షణాలు కనిపించవు, కానీ డెంగ్యూ జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. జ్వరం, కళ్ళు ఎర్రబడడం, కీళ్ల నొప్పి , తలనొప్పి, అలెర్జీ వంటి లక్షణాలు కనిపిస్తాయని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.డెంగ్యూ మాదిరిగా, జికా వైరస్ కేసులు పెరగడానికి అనేక అంశాలు కారణమని, వీటిలో వాతావరణంలో ఆకస్మిక మార్పులు, మురికి నీరు ఇళ్ల చుట్టూ చేరడం వల్ల దోమలు పెరగడం అవి కుట్టడం ద్వారా ఎలాంటి తీవ్రమైన వైరస్ వస్తుందని వైద్యనిపుణులు అంటున్నారు.
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
ఇది కూడా చదవండి.. 30 ఏళ్ల తర్వాత శరీరానికి కొల్లాజెన్ ఎందుకు ముఖ్యమంటే..?
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో నివారించాల్సిన ఆహారాలు, కూరగాయలు
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
