గ్లోబల్ హ్యాండ్‌వాషింగ్ డే ప్రాముఖ్యత..
సాక్షి లైఫ్ : సూక్ష్మక్రిములు అనారోగ్యానికి కారణమవుతాయి. మనం సబ్బునీటితో గానీ, శుభ్రమైన నీటితో గానీ చేతులు కడుక్కోకపోతే, ముఖ్యంగా బాత్రూమ్‌ను ఉపయోగించిన అనంతరం, ఆహారం తినేటప్పుడు చేతులు శుభ్రపరుచుకోపోతే సూక్ష్మ క్రిములు కడుపులోకి వెళ్లి పలు అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. సురక్షితంగా ఆరోగ్యంగా ఉండటానికి సులభమైన హ్యాండ్‌వాష్ చిట్కాలను తెలియజేయడమే లక్ష్యంగా పెట్టుకుంది గ్లోబల్ హ్యాండ్‌వాషింగ్ డే. అందుకోసం ప్రతి ఏటా గ్లోబల్ హ్యాండ్‌వాషింగ్ డేను అక్టోబర్ 15వతేదీన జరుపుతారు. పలు కార్యక్రమాల ద్వారా ప్రజల్లో పరిశుభ్రత ఆవశ్యకతను తెలియజేస్తారు.
ఇది కూడా చదవండి..లిపోప్రోటీన్ గ్లోమెరులోపతి అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి..ఆర్థరైటిస్ చికిత్సలో స్టెమ్ సెల్ థెరపీని ఉపయోగించడంలో ఎలాంటి సవాళ్లు ఉన్నాయి?..
ఇది కూడా చదవండి..జాక్‌ఫ్రూట్ రక్తంలో చక్కెర స్థాయిలను ఎలా ప్రభావితం చేస్తుంది..?
చేతులు కడుక్కోవడానికి సులభమైన మార్గాలు తెలుసుకుందాం..
నీటితో చేతులను తడిపి, హ్యాండ్ వాష్ క్రీమ్ గానీ సబ్బును గానీ రాయాలి. అనంతరం నురుగ వచ్చేవరకు చేతులను కలిపి రుద్దండి. వేళ్లు, అరచేతులు, వెనుకభాగం, మణికట్టు, వేళ్ల మధ్య, గోళ్ల కింద రుద్ది కడగాలి. సబ్బు నురగ పోయే వరకు కడగాలి. ఆ తర్వాత చేతులను టవల్ తో తుడుచుకోవాలి.
ఇది కూడా చదవండి..న్యాచురల్ గా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గాలంటే..ఏమి చేయాలి..?
ఇది కూడా చదవండి..మీ కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి 7 మార్గాలు
ఇది కూడా చదవండి..అల్లోపతి, యునాని చికిత్సా విధానాల మధ్య ముఖ్యమైన తేడాలు ఏమిటి?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
