సాక్షి లైఫ్ : దేశంలో హెచ్ఐవి, ఎయిడ్స్ కేసులను అరికట్టేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక అడుగు వేసింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 219 జిల్లాలను అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రాంతాలుగా గుర్తించి, అక్కడ ముమ్మరంగా నివారణా చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. కేంద్ర ఆరోగ్య శాఖ పరిధిలోని నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (NACO) తాజాగా నిర్వహించిన 'సురక్ష సంకల్ప కార్యశాలలో ఈ వివరాలను వెల్లడించింది. ముఖ్యంగా ఢిల్లీ, హర్యానా రాష్ట్రాల్లో వైరస్ వ్యాప్తిని అరికట్టడంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.
ఇది కూడా చదవండి..Diabetes : డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోవడానికి ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి..?
ఇది కూడా చదవండి.. ఎసిడిటీని అంతమొందించే ఇంటి చిట్కాలు..
ఇది కూడా చదవండి..Shock for Tattoo Lovers..! టాటూస్ తో 29శాతం స్కిన్ క్యాన్సర్ ముప్పు..
గణాంకాలను పరిశీలిస్తే, దేశ రాజధాని ఢిల్లీ , పొరుగు రాష్ట్రమైన హర్యానాలో హెచ్ఐవి వ్యాప్తి ప్రభావం గణనీయంగా ఉన్నట్లు అర్థమవుతోంది. ఢిల్లీలో అడల్ట్ హెచ్ఐవి ప్రాబల్యం (Adult HIV Prevalence) 0.33 శాతంగా ఉండగా, అక్కడ సుమారు 59,079 మంది బాధితులు ఉన్నట్లు అంచనా. మరోవైపు, హర్యానాలో ప్రాబల్యం 0.24 శాతంగా నమోదైనప్పటికీ, బాధితుల సంఖ్య మాత్రం ఢిల్లీ కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం. ఇక్కడ సుమారు 59,642 మంది ఈ వైరస్‌తో జీవిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.
ఈ రెండు ప్రాంతాల్లోనూ బాధితుల సంఖ్య దాదాపు 60 వేల దరిదాపుల్లో ఉండటంతో, వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఇక్కడ మరిన్ని కఠిన నివారణా చర్యలు, విస్తృత అవగాహన కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించింది.
ఢిల్లీలో ప్రభావిత ప్రాంతాలు..నార్త్, న్యూఢిల్లీ, షాదరా, సెంట్రల్, సౌత్ ఈస్ట్, సౌత్, నార్త్ వెస్ట్ జిల్లాలు.
హర్యానాలో ప్రభావిత ప్రాంతాలు..పానిపట్, రోహ్తక్, సిర్సా, గురుగ్రామ్, ఫరీదాబాద్ వంటి 11 జిల్లాలు.
లక్ష్యం 95:95:95..
2027 నాటికి HIV/AIDSని అదుపులోకి తీసుకురావడమే లక్ష్యమని NACO డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాకేష్ గుప్తా తెలిపారు. దీని కోసం '95:95:95' సూత్రాన్ని అమలు చేయాలని అధికారులకు పిలుపునిచ్చారు.
మొదటి 95..బాధితుల్లో 95 శాతం మందికి తమకు ఇన్ఫెక్షన్ ఉందనే విషయం తెలియాలి. రెండవ 95.. వ్యాధి నిర్ధారణ అయిన వారిలో 95 శాతం మందికి యాంటీ రిట్రోవైరల్ థెరపీ (ART) చికిత్స అందాలి. మూడవ 95.. చికిత్స తీసుకుంటున్న వారిలో 95 శాతం మందిలో వైరల్ లోడ్ గణనీయంగా తగ్గాలి. ఢిల్లీలో వ్యాధిగ్రస్తులుగా గుర్తించిన వారిలో కేవలం 70 శాతం మందికి మాత్రమే ప్రస్తుతం చికిత్స అందుతోందని, ఈ అంతరాన్ని త్వరగా తొలగించాలని వైద్యనిపుణులు హెచ్చరించారు.
తల్లి నుంచి బిడ్డకు సంక్రమించకుండా..
గర్భధారణ సమయంలో లేదా తల్లి పాలు ఇచ్చే క్రమంలో శిశువులకు వైరస్ సోకకుండా చూడటం అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని వైద్యనిపుణులు పేర్కొన్నారు. సకాలంలో పరీక్షలు, కౌన్సెలింగ్, చికిత్స అందిస్తే హెచ్ఐవి రహిత సంతానాన్ని పొందడం సాధ్యమేనని వారు స్పష్టం చేశారు. ఇందుకోసం గర్భిణీలకు స్క్రీనింగ్ పరీక్షలను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..?
ఇది కూడా చదవండి.. రసాయనాలతో పండిన పుచ్చకాయను ఎలా కనుక్కోవచ్చు..
ఇది కూడా చదవండి.. షుగర్ ఉన్నవాళ్లు పైనాపిల్ తినకూడదా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com