భారత్‌లో కరోనా కల్లోలం.. మళ్లీ పెరుగుతున్న కేసులు.. 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : దేశంలో కరోనా వైరస్ మరోసారి కలకలం సృష్టిస్తోంది. గత కొంతకాలంగా అదుపులో ఉన్న మహమ్మారి, ఇప్పుడు మళ్లీ మెల్లమెల్లగా తన ఉనికిని చాటుకుంటోంది. దేశవ్యాప్తంగా మొత్తం 257 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ పెరుగుదల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అధికారిక గణాంకాల ప్రకారం..మే 12వ తేదీ తరువాత ఇప్పటివరకు మొత్తం 257 కేసులు నమోదయ్యాయి. ఇందులో కేరళ అత్యధికంగా 69 కేసులతో ముందుంది, తరువాత మహారాష్ట్ర (44), తమిళనాడు (34) స్థానాల్లో ఉన్నాయి.

ఇది కూడా చదవండి..ప్రీక్లాంప్సియా అంటే ఏమిటి..? ఎలాంటి మహిళల్లో వస్తుంది..? 

ఇది కూడా చదవండి..Thyroid problems : థైరాయిడ్ సమస్యకు ప్రధాన కారణాలు..? 

ఇది కూడా చదవండి..జ్ఞాపకశక్తి తగ్గుతోందా..? అయితే అది జబ్బుకు సంకేతం కావచ్చు.. 

ఎక్కువగా ప్రభావితమైన రాష్ట్రాలు.. 

కేరళ: 69 కేసులు
మహారాష్ట్ర: 44 కేసులు
తమిళనాడు: 34 కేసులు
కర్ణాటక: 8 కేసులు
గుజరాత్: 6 కేసులు
ఢిల్లీ: 3 కేసులు

ఇది కూడా చదవండి..ఆస్తమా వచ్చిందంటే జీవితాంతం మందులు వాడాలా..?

ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..?

ఇది కూడా చదవండి..బర్డ్ ఫ్లూ వైరస్ ఎన్ని డిగ్రీల సెల్సియస్ వరకు సజీవంగా ఉంటుంది..?

ఇది కూడా చదవండి..జాయింట్ పెయిన్స్ తగ్గించే సూపర్ ఫుడ్స్.. 

 

హర్యానా, రాజస్థాన్, సిక్కిం, ఒక్కొక్క కేసు నమోదవ్వగా, ముంబైలోని కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ (కేఈఎం) ఆసుపత్రిలో రెండు కరోనా మరణాలు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది.

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.